
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ తో 'పుష్ప' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. రంగస్థలం లాంటి హిట్ తర్వాత సుకుమార్, అల వైకుంఠపురం లో సినిమా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి..

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఆయనతదుపరి సినిమాపై ఇప్పుడు అంచనాలు నెలకొన్నాయి. గతంలో అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఆ మధ్య నిర్మాత దిల్ రాజు - దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 'వకీల్ సాబ్' తరువాత దిల్ రాజు - వేణు శ్రీరామ్ మళ్లీ ప్రయత్నించినా బన్నీ పెద్దగా స్పందించలేదనే టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా ఉందని తాజాగా బన్నీవాసు స్పష్టం చేశాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. బన్నీ 'పుష్ప 1' చేసిన తరువాత 'ఐకాన్' సెట్స్ పైకి వెళుతుందని ఆయన అన్నాడు. ఆ తరువాతనే 'పుష్ప 2' షూటింగు మొదలదలవుతుందని చెప్పాడు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదనే విషయాన్ని స్పష్టం చేశాడు.