లెహరాయి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - కార్తికేయ!!

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం.

హీరో కార్తికేయ మాట్లాడుతూ...
అందరికి నమస్కారం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.  ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. కొత్త సినిమా హిట్ ఎంత హిట్ అయితే అంతమంది కొత్తవాళ్లు వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది.సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరో రంజిత్ మాట్లాడుతూ...
వేణుగోపాల్ గారికి చాలా థాంక్యూ. ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ఆయనే. ఈ రోజు నాకు 100 కోట్లు లాటరీ గెలిచినంత ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి కథ, ఇది పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది. ఈ సినిమా స్టార్ట్ ఐనప్పటినుండి మంచి పాజిటివ్ వైబ్ ఉంది. మా మూవీ ప్రోమోట్ చెయ్యడానికి వచ్చిన కార్తికేయ గారికి చాలా థాంక్యూ. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.డిసెంబర్ 9న థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నా.

దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ...
ముందుగా మీడియాకు కృతజ్ఞతలు.ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి కృతజ్ఞతలు.ఈ రోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ గారు ఈ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాకి హీరో  మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయనే మా దేవుడు మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు మాకంటే ఎక్కువగా సినిమాపై మంచి ఇంట్రస్ట్ చూపించారు అంటూ, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. డిశంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ...
ఇక్కడికి వచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. ఈ సినిమాను నా మిత్రుడు కుమారస్వామి ప్రారంభించారు. ఇదివరకు ఆయన తీసిన సినిమాలకు  నేను భాగస్వామిగా ఉన్నాను. కరోనా మహమ్మరి కారణంగా ఆయన చనిపోయాక ఈ సినిమాను పట్టుబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఈ సినిమాను కథాపరంగా, పాటల పరంగా మా టీం అంతా ఎంతో కష్టపడ్డారు.

సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నాం.ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను మంచి సపోర్ట్ చేసారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు.


నటీనటులు:

రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ, సత్యం రాజేష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక బృందం:

సమర్పకుడు: బెక్కం వేణుగోపాల్
బ్యానర్: S.L.S. సినిమాలు
చిత్రం: "లెహరాయి"
నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
రచయిత, దర్శకుడు: రామకృష్ణ పరమహంస
సంగీతం: GK (ఘంటాడి కృష్ణ)
D.O.P.: MN బాల్ రెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
గేయ రచయితలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఉమా మహేష్, పాండు తన్నీరు
ఫైట్ మాస్టర్: శంకర్
కొరియోగ్రాఫర్‌లు: అజయ్ సాయి
రచయిత: పరుచూరి నరేష్

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.