
ఈ లాక్ డౌన్ లో బాగా వినిపించిన పేరు సోను సూద్. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ గా నటించిన సోను సూద్, తాను రియల్ హీరోని అని అనిపించుకున్నాడు. కరోనా సమయంలో సోను సూద్ చేసినంత సహాయం బహుశా ఎవరూ చేసి ఉండరేమో. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన పెద్ద మనసు సోను సూద్ ది. వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపడం దగ్గరనుండి విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులను స్పెషల్ ఫ్లయిట్ ద్వారా ఇండియా రప్పించడం వరకూ ఎన్నో సహాయాలు సోను సూద్ చేసాడు. సోను సూద్ పెద్ద మనసుకు ఇంకా ఎక్కువ సహాయ అభ్యర్ధనలు వచ్చేవి. అయినా కూడా ముఖం మీద చిరునవ్వుతోనే ఈ రియల్ హీరో తన సహాయాలను కొనసాగించాడు, కొనసాగిస్తున్నాడు. అలాంటి సోను సూద్ మీద వచ్చిన పుస్తకం ‘ఐ యామ్ నో మెస్సయ్య’ మీనా కె అయ్యర్ రాసిన ఈ పుస్తకానికి సోను సూద్ కూడా సహాయ సహకారాలు అందించాడు. డిసెంబర్ 15న విడుదల కానున్న ఈ పుస్తకాన్ని అమెజాన్ లో ప్రీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. వేల 319 రూపాయలు.
.@SonuSood's life has been inspiring in many ways, and so has been the lives of many migrant workers he impacted. 🌟
— Penguin India (@PenguinIndia) November 24, 2020
Read all about it in this upcoming book!
Pre-order #IAmNoMessiah in English https://t.co/xz8BZNxwrw and Hindi https://t.co/hecuNuvXSy pic.twitter.com/8wqsaRy5DF