
హరిహర వీరమల్లు గా పవన్ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది.. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో ఓ రేంజ్ లో ఉన్నాడని అభిమానులు తెగ పొగిడేశారు... చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని సోషల్ మీడియా లో తెగ కామెంట్స్చేశారు.. ఇప్పటికే సోషల్ మీడియా పవన్ ఫాన్స్ హంగామా తగ్గలేదు.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఈ లుక్ లో రివీల్ చేశారు.
స్వయంగా పవర్ స్టారే కరోనా బారిన పడటంతో ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు పున:ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ముందు అనుకున్నట్లు అయ్యప్పనుం కోషీయుం రీమేక్ సెప్టెంబరులో, హరిహర వీరమల్లు 2022 సంక్రాంతికి విడుదల అవుతాయా కావా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే అయ్యప్పనుం కోషీయుం రీమేక్ సంగతేమో కానీ.. ‘హరి హర వీరమల్లు’ మాత్రం సంక్రాంతికి వస్తుందనే ధీమాతోనే ఉన్నాడు నిర్మాత ఎ.ఎం.రత్నం.
పవన్‌తో రత్నం నిర్మించిన మెగా బ్లాక్‌బస్టర్ ‘ఖుషి’ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రత్నం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ చిత్ర షూటింగ్ ఆపేశామని.. మళ్లీ ఎప్పుడు చిత్రీకరణ పున:ప్రారంభం అవుతుందో స్పష్టత లేదని.. అయినప్పటకీ ‘హరి హర..’ను 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనే ధీమాతోనే ఉన్నట్లు రత్నం తెలిపాడు.