
టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ ఒక రేంజ్ ఎనర్జీని కనబరుస్తూ ఉంటాడు. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో ఎప్పటికప్పుడు వాళ్లను అలరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన సినిమా హిట్ అయితే హడావిడి చేయడం .. ఫ్లాప్ అయితే డీలాపడిపోవడం ఆయనకి తెలియదు.

ఒకదాని తరువాత ఒకటిగా ప్రాజెక్టులను లైన్లో పెడుతుంటాడు .. సినిమాలను వరుసగా చేసుకుంటూ వెళుతుంటాడు. అలా 18 సినిమాలు పూర్తి చేసిన రామ్, తాజాగా తన 19వ సినిమాను పట్టాలెక్కించాడు. తమిళ దర్శకుడు లింగుసామితో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. నిన్ననే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

ఈ సినిమా నుంచి రామ్ పారితోషికం పెంచాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతవరకూ సినిమాకి 10 కోట్లు తీసుకున్న రామ్, ఇప్పుడు 13 కోట్లు అందుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇది ద్విభాషా చిత్రం కావడం వల్లనే అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం లింగుసామికి 6 కోట్లు ముడుతున్నాయట.