ఈహీరోలు స్పీడ్ పెంచారు.. ఈ ఏడాది రెండు సినిమాలతో...?

ఒకప్పుడు హీరోలు సినిమాలు ఏడాదికి ఐదు కి మించి ఉండేవి.. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో ఇలా షూట్ చేసి అలా రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనమైపోయింది.. ప్రేక్షకుల అభిరుచులు మారడమే దీనికి కారణం.. అప్పుడంటే ఎలా తీసినా చూసేవారు.. బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉన్న పట్టించుకునేవారు కాదు.. కానీ ఇప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా భారీ గా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తున్నారు హీరోలు..

‌అయితే ఇటీవలే కాలంలో హీరోలు స్పీడ్ పెంచారు. ఏడాదికి ఒక్క సినిమా చేసేవారు రెండు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ ఏడాది ఒక్కో హీరో కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి మన హీరోలు కృషి చేస్తున్నారు.. ఆ సినిమాలేవో ఒక్కసారి చూద్దాం..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు సినిమాలతో రెడీ గా ఉన్నాడు.. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా హరిహర వీరమల్లు గా త్వరలోనే ప్రేక్షకుల చెంతకు రానున్నాడు.. ఈ ఏడాది చివర్లో రాబోతున్నారని తెలుస్తుంది..

ఇక ఇప్పటికే క్రాక్ సినిమాతో రవితేజ ప్రేక్షకులను అలరించగా ఖిలాడీ తో మే లో రాబోతున్నాడు.. క్రాక్ సినిమా హిట్ జోష్ ను ఈ సినిమా ను కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.. ఇక శ్రీకారం తో ఈ ఏడాది తన సినిమాలకు శ్రీకారం చుట్టిన శర్వానంద్ మహా సముద్రం తో రెండో సారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇక వెంకటేష్ నారప్ప, F3 , దృశ్యం 2  సినిమాలతో ఈ ఏడాది రెండు సార్లు ప్రేక్షకులను అలరించబోతున్నాడు.. F3 మే 14 న వస్తుండగా నారప్ప ఆగస్టు 27 ,దృశ్యం 2 డిసెంబర్ లోరానుంది.. ఇక నాని వి తర్వాత టక్ జగదీష్ తో మళ్ళీ రానున్నాడు. రానా విరాటపర్వం, అరణ్య లతో రానున్నాడు.. నితిన్ చెక్, రంగ్ దే లతో పలకరించనున్నాడు.. ఏదేమైనా మన టాలీవుడ్ హీరోల ఈ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకు పండగ రోజులొచ్చాయని చెప్పొచ్చు..

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.