
టాలీవుడ్ లో ఎన్ని వివాదాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని విమర్శలు వచ్చినా అందరికి సమాధానం చెప్పేది మాత్రం ఒక్క విజయం తోనే.. హీరోలు తమపై వచ్చే విమర్శలన్నిటికి ఈ సినిమా హిట్ తో సమాధానం చెప్పి అందరి నోళ్లను మూయిస్తారు. అయితే కొంతమంది కి బాడ్ లుక్ ఎలా ఉంటుందంటే వారు ఎంత ట్రై చేసినా ఒక్క సినిమా హిట్ కాదు.. చేయడానికి మంచి సినిమాలే చేశారు. కానీ వారు బాడ్ లక్కో ఎదో తెలీదు.. సినిమాలు మాత్రం ఆడవు.. తద్వారా వారి ఇమేజ్ ను ఇంకొంత తగ్గించుకుంటారు. ఆలా టాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టడం కోసం వేచి చూస్తున్న హీరోల ను చూద్దాం..

వరుసగా మూడు సూపర్ హిట్ లు కొట్టి స్టార్ హీరోలను భయపెట్టిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఫ్లాప్లతో సతమతమవుతున్నాడు. అయన ఏ సినిమా చేసిన ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.. అది నిజంగా రాజ్ తరుణ్ బాడ్ లక్ అని చెప్పొచ్చు. ఇక డిఫెరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచినా సందీప్ కూడా ఇదే సమస్య తో బాధపడుతున్నారు. ఏ సినిమా చేసిన అది ఫ్లాప్ అవుతుంది. కనీసం యావరేజ్ గ కూడా నిలవట్లేదు. ఈమధ్య చేసిన A1 ఎక్స్ ప్రెస్ సినిమా కూడా నిరాశపరిచింది.

ఇక ఇటీవలే మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మంచు విష్ణు హిట్ మొహం చూసి చాలారోజులైపోయింది.. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా విష్ణు సక్సెస్ కి అదేమీ ఉపయోగపడట్లేదు. ఆది సాయి కుమార్ పరిస్థితి చెప్పనవసరం లేదు.. శశి గా ప్రేక్షకులముందు భారీ అంచనాలతో వచ్చి తుస్సుమన్నాడు.. ఒకే ఒక లోకం పాట తో సినిమా పై హైప్ రాగ ఆ పాట కూడా సినిమా ఫ్లాప్ నుంచి కాపాడలేకపోయింది. ఇక సుమంత్, శ్రీ విష్ణు లాంటి హీరోలు కూడా హిట్ కొట్టడం కోసం అట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. డిఫరెంట్ సినిమాలు చేయడానికి ప్రత్నించి బోర్లాపడుతున్నారు.. మరి నటులుగా మంచి మార్కులు సాధిస్తున్న వీరికి ఏసినిమా హిట్ అందిస్తుందో చూడాలి.