గతాన్ని గుర్తు చేసుకున్న రేణు దేశాయ్

View this post on Instagram

. 9th September, 1995. It’s been 25yrs since I first faced the camera. I wanted to either be a space scientist or a neurosurgeon since childhood and my mark sheets supported my wishes. But, I guess destiny had other plans for me because when unexpectedly I faced the camera as a 16yr old, I fell in love with with the process of film making. And as we all know the rest is history. It was an extremely painful decision for me as a 16yr old to let go of my dream of becoming a space scientist and joining NASA. It definitely bothered me for few years but as my love for film making grew I made peace with my love for physics and mathematics. As a director I still have to deal with “stars” albeit a little bit different ones😁 Follow your heart always and work hard and sincerely and I personally guarantee you that success and happiness will be yours! [these pics are from my first ever photo shoot. We didn’t have any photoshop or fancy equipment. What was there was what we got🙈] 📸 - Palash Bose

A post shared by renu desai (@renuudesai) on

మోడలింగ్ లో  ఫుల్ సక్సెస్ లో ఉండగా బ్రది సినిమాతో హీరోయిన్ అయింది రేణూ దేశాయ్.. తన ఫస్ట్ మూవీతోనే పవన్ కళ్యాణ్ సరసన నటించింది.. ఆతర్వాత కొన్ని సంవత్సరాల పాటు వీరు రిలేషన్ లో ఉంటూ వచ్చి 2009 లో వివాహమాడి, 2012 లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తన 16 ఏళ్ల వయస్సులో కెమెరా ముందుకు వచ్చిన మొట్టమొదటి రోజును గుర్తు చేసుకున్నారు.

అంతరిక్ష శాస్త్రవేత్త లేదా న్యూరో సర్జన్ కావాలన్న తన కలను వీడటం చాలా బాధాకరమైన నిర్ణయం అని ఆమె వెల్లడించింది, షోబిజ్ అరేనాలో తన కలను విడిచిపెట్టినందుకు ఆమెను మొదట కొన్నేళ్ళు బాధపెట్టినప్పటికీ, చిత్రనిర్మాణంలో ఆమెకున్న ఆసక్తి ఇటు వైపు అడుగులు వేసేలా చేసింది.. ఇక తర్వాత జరిగింది అంతా తెలిసిందే.

“9 సెప్టెంబర్, 1995" అని మెన్షన్ చేస్తూ ఆమె మొట్టమొదటి ఫోటో షూట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. "నేను కెమెరాను మొదటిసారి ఫేస్ చేసి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. నేను చిన్నప్పటి నుండి అంతరిక్ష శాస్త్రవేత్త లేదా న్యూరో సర్జన్ అవ్వాలనుకున్నాను మరియు నా మార్క్ షీట్లు నా కోరికలకు బలాన్ని ఇచ్చాయి. కానీ, డెస్టినీ నాకు ఇతర ప్రణాళికలను కలిగి ఉందని
తెలియజేసింది. 16 సంవత్సరాల వయస్సులో కెమెరాను ఎదుర్కొన్నప్పుడు, చలన చిత్ర నిర్మాణ ప్రక్రియతో నేను ప్రేమలో పడ్డాను. మనందరికీ తెలిసినట్లుగా మిగిలినది అంతా చరిత్ర.” అని రాసారు ఆమె పోస్ట్ లో.

ఆమె చివరిగా "మీ హృదయాన్ని ఎల్లప్పుడూ అనుసరించండి, కష్టపడి హృదయపూర్వకంగా పనిచేయండి.  విజయం మరియు ఆనందం మీదేనని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను!" అన్నారు..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.