పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తదుపరి రెండు చిత్రాల రిలీజ్ డేట్ లు ఫిక్స్ అయ్యాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయన ప్రస్తుతం చేస్తున్న మలయాళం రీమేక్ సినిమా సంక్రాంతి కి విడుదలయ్యే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆఖరి దశ షూటింగ్ కి చేరుకుంది. రానా మరో ప్రధానమైన పాత్రలో నటిస్తున్నారు.

పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత వలన చాలా రోజుల పాటు షూటింగు ఆపుకోవలసి వచ్చింది. ఈ కారణంగా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే పరిస్థితి లేదు. అందువలన సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఇక క్రిష్ దర్శకత్వంలోని తదుపరి సినిమా హరిహర వీరమల్లు వచ్చే ఏడాది వేసవికి విడుదల అవుతుందని  అంటున్నారు.  ముందుగా అనుకున్న ప్రకారం 'హరిహర వీరమల్లు' సంక్రాంతికి రావలసి ఉంది.

కానీ కరోనా ఎఫక్ట్ కారణంగా ఈ సినిమా కూడా షూటింగ్ పరంగా ముందుకు వెళ్లలేకపోయింది. షూటింగ్ పరంగా జరిగిన జాప్యం వలన ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. అందువలన సంక్రాంతి బరిలోకి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ ను దింపాలని చూస్తున్నారట. చారిత్రక నేపథ్యంలో .. మొగల్ చక్రవర్తుల కాలంనాటి కథతో నడిచే 'హరి హర వీరమల్లు', ఎక్కువ భాగం షూట్ చేయవలసి ఉంది. ఈ కారణంగా ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.