
క్రియ ఫిల్మ్ కార్పోరేషన్ అండ్ కాళీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘గమనం’. ఈ చిత్రానికి నిర్మాతలుగా కరుటూరి, వెంకీ పూశాడపు మరియు జ్ఞానశేఖర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రియా శరన్, నిత్యా మీనన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహించారు. ఇటీవలే విడదలైన ‘గమనం’ టైటిల్ పోస్టర్ విశేష స్పందనకు నోచుకుంది. ఈ చిత్రం ఒకే సారి తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల అవ్వబోతుండడం విశేషం. తాజాగా తెలుగుకి సంభందించి టాలివుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేసారు. మిగతా భాషల్లో కూడా ఈ చిత్రం యొక్క ట్రైలర్ లు కూడా విడుదల చేసారు. మలయాళంలో ఫహద్ ఫాసిల్, తమిళంలో జయం రవి, కన్నడలో శివ రాజ్ కుమార్, హిందీ లో సోను సూద్ లు ఆయా భాషల్లో విడుదల చేసారు. గమనం ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ లొకేషన్ లో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి మంచి నైపుణ్యత గల సాంకేతిక నిపుణులు పని చేసారు. జ్ఞాన శేఖర్ కెమెరా మాన్ గా చేస్తూ, నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అలాగే ఈ చిత్రానికి మంచి తారాగణం కుదరడం తో ఈ ప్రాజెక్ట్ కాస్తా క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. ఈ చిత్రంలో శివ కందుకూరి, ప్రియాంక జవల్కర్, సుహాస్, చారుహాసన్, ప్రియ, ఇందు ఆనంద్, సంజయ్ స్వరూప్, బిత్తిరి సత్తి, నేహాంత్, రవి ప్రకాష్, రాజు, తదితరులు నటించారు. ఇలా ఐదు భాషల నటులు ఈ చిత్రం లో నటించారు. ఈ చిత్రానకి మేస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ గా నిలవనుంది.
