
శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'గమనం' మూవీ శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ఫస్ట్ లుక్ విడుదల ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ఉన్నారు.
సుజనా రావు దర్శకత్వంలో వస్తున్న గమనం చిత్రాన్ని ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అయినటువంటి జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారి రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో లో శ్రియ శరణ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఇంతకుముందు శ్రియ బర్త్ డే సందర్భంగా శ్రియ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తర్వాత రెండవ ఫస్ట్ లుక్ గా నిత్యా మీనన్ (శాస్త్రీయ సంగీత గాయని శైలాపుత్రి దేవి) పోస్టర్ ని విడుదల చేశారు. ఇప్పుడు మూడవ ఫస్ట్ లుక్ పోస్టర్ గా శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ల
పోస్టర్ని విడుదల చేశారు ఈ సినిమాలో శివ కందుకూరి 'అలీ' అనే పాత్రలో కనిపించనున్నాడు. ప్రియాంక జవాల్కర్ 'జారా' అనే పాత్రలో కనిపిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తుండగా, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.