
యూత్ స్టార్ నితిన్ ఇటీవలే రంగ్ దే సినిమా తో సాలిడ్ హిట్ కొట్టాడు.. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ రంగ్ దే నితిన్ రేంజ్ కి మంచి హిట్ కొట్టినట్లే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అతనికి హ్యాట్రిక్ దక్కగా నితిన్ కి మస్ట్ విన్ కావాల్సిన టైం లో హిట్ అయ్యింది రంగ్ దే.. అంతకుముందు చేసిన సినిమా చెక్ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడగా వెంకీ అట్లూరి పై నితిన్ పెట్టుకున్న నమ్మకం ని ఒమ్ము చేయలేదు..

ఇకపోతే నితిన్ ఈ సినిమా తరవాత రెండు సినిమాలను ఒప్పుకున్నా విషయం తెలిసిందే. ఒకటి ప్రస్తుతం చేస్తున్న మ్యాస్ట్రో సినిమాకాగా మరోకటి కృష్ణ చైతన్య దర్శకత్వంలోని పవర్ పేట సినిమా.. మ్యాస్ట్రో సినిమా నితిన్ కెరీర్ లో వెరైటీ సినిమా గా రాబోతుంది. ఆ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపిస్తున్నాడు.. ఇటీవలే గ్లిమ్ప్స్ కూడా వచ్చింది.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ అందదున్ సినిమా కి ఇది రీమేక్..

కాగ మరో చిత్రాన్ని కూడా నితిన్ ఒప్పుకునట్లు సమాచారం.. యూత్ స్టార్ నితిన్ తో ఓ మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట క్రాక్ నిర్మాత.. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. 'రేసుగుర్రం' 'కిక్' 'టెంపర్' 'ఎవడు' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ కోసం అధ్బుతమైన కథను రెడీ చేసి హీరో నుంచి పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి.