అల్లు అర్జున్ పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందా..!!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ వేరే లెవెల్ లో ఈ సినిమా ను తెరకెక్కించారట. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా లోని పాటలకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదలడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇంకా డేటు .. టైమ్ అనుకోలేదట. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పుకుంటున్నారు. అడవి నేపథ్యం .. రహస్యంగా జరిగే ఎర్రకలప అక్రమ రవాణా .. గిరిజన యువతిగా రష్మిక .. గూడెం ప్రజల్లో హుషారెత్తించే ఐటమ్ సాంగ్ .. ఇవన్నీ కూడా ఆసక్తిని రేకెత్తించే అంశాలే.

అందువలన ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందన్నా అంతా ఆత్రుతను చూపుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే విషయం ఆల్రెడీ జనంలోకి వెళ్లిపోయింది. ఇక లిరికల్ వీడియోతో డాన్సులు గట్రా ఎలా ఉంటాయనేది శాంపిల్ చూపించనున్నారు. ఫహాద్ ఫాజిల్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.