
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్ మరియు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ "ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రం లో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రం లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్ మరియు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రం లోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. మంచి రిలీజ్ డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాము" అని తెలిపారు.
చిత్రం పేరు : ధీమహి
నటీనటులు : సాహస్ పగడాల, నిఖిత చోప్రా, విరాట్ కపూర్, జె డి చెరుకూరు, ఆషిక, శ్రీజిత్, గంగాధరన్, సౌజన్య కాసినా, వంశి దావులూరి, తదితరులు
ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి
కెమెరా మాన్ : రహ్ శర్మ
మ్యూజిక్ : షారోన్ రావి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చైతు పడిగల
కో ప్రొడ్యూసర్ : ఎమ్ ఎస్ కార్తీక్, శ్రీధర్ రెడ్డి గూడా
దర్శకులు : సాహస్ పగడాల, నవీన్ కంటె
నిర్మాతలు : విరాట్ కపూర్ , సాహస్ పగడాల