భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన నటుడు దగ్గుపబాటి రానా. ఈ రోజ రానా దగ్గుబాటి పుట్టిన రోజు. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, రానా హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ప్రియమణి లుక్ తో పాటు, సాయి పల్లవి లుక్ కూడా రివీలైంది. ఇద్దరి ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే రానా బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఇందులో రానా చేతిలో గన్‌తో నక్సలైట్ అవతారంలో కనిపిస్తున్నారు తొంభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి రానా లుక్ తో ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. ఈ మేరకు వేణు ఊడుగుల ట్వీట్ చేస్తూ, 'ప్రమాదభరితమైన ప్రేమ లోతుల్లోని తొలి విక్షణం' అని తెలిపాడు. విరాట పర్వం టీజర్ లో రానా రవన్న అనే నక్సలైట్ లీడర్‌గా అదరగొట్టాడు. సురేష్ బొబ్బిలి సంగీతం ప్రత్యేక ఆకర్షణ గా నిలవనుంది. ఈ టీజర్ రానా అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పుకొవచ్చు.