లైగర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ హీరోగా, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం కోసం అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడైతే ఏకంగా విజయ్ దేవరకొండ పోస్టర్స్ కి పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. ఇక మే 9 విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ విడుదల చేస్తామని చెప్పిన చిత్ర బృందం హ్యాండ్ ఇచ్చింది. దీంతో టీజర్ రిలీజ్ కి హంగామా చేయాలని ఎరెంజ్మెంట్స్ చేసుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి.

అయితే టీజర్ ను విడుదల చేయకపోవటంపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. మే 9న ‘లైగర్‌’ సినిమా పవర్‌ ప్యాక్డ్‌  యాక్షన్‌ టీజర్‌ను విడుదల చేయాలని మేం అందరం అనుకున్నాం. కానీ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్న ఈ తరుణంలో ‘లైగర్‌’ టీజర్‌ను విడుదల చేయాలని అనుకోవడం లేదు. అందుకే వాయిదా వేశాం. ఈ క్లిష్ట సమయాలు వెళ్లిపోయాక ‘లైగర్‌’ టీజర్‌ను మీ ముందుకు తీసుకువస్తాం.

టీజర్‌ విడుదలైన తర్వాత ‘లైగర్‌’ చిత్రంలోని విజయ్‌ దేవరకొండ లుక్‌కి, ఫెర్మార్మెన్స్‌కి ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. టీజర్‌ విడుదల కానుందుకు ఇప్పుడు నిరుత్సాహపడ్డవారు ఆ క్షణం డబుల్‌ హ్యాపీతో ఉంటారు. అప్పటివరకు దయచేసి అందరు ఇంట్లోనే ఉండండి. మీ, మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. బాధ్యతగా ఉండండి. ఒకరికొకరం సాయం చేసుకుంద్దాం. వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ వేయించుకుంద్దాం. కోవిడ్‌ జాగ్రత్తలను, వైద్యుల సలహాలను పాటిద్దాం. కరోనాపై అందరం సమష్టిగా పోరాడదాం. త్వరలో థియేటర్స్ లో కలుద్దాం అని వారు అన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.