ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినా పవర్ అలానే ఉంది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శరవేగంగా సినిమాలను ఫినిష్ చేసేపనిలో ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తిచేసి రీఎంట్రీకి రెడీ అయిపోయాడు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదివరకు రిలీజ్ చేసిన ఆ సినిమా టీజర్ సాంగ్స్ అమాంతం సినిమా పై అంచనాలను పెంచేసాయి. ఇదివరకు ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా ఆయన సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ టైంలోనే ఆయన తదుపరి సినిమాలు అనౌన్స్ చేసేసారు. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, డైరెక్టర్ క్రిష్ తో ఓ సినిమా, హరీష్ శంకర్ తో ఓ సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చారిత్రాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ ఇంతకుముందు ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నాడు. రాబిన్ హుడ్ టైప్ పాత్రలో పేదల కోసం పోరాడే బందిపోటుగా కనిపిస్తాడని తెలుస్తుంది. అలాగే చారిత్రక నేపథ్యం కాబట్టి ఈ సినిమా మొఘల్ రాజుల పాలన సమయంలో జరిగిన కల్పిత కథగా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో పవర్ స్టార్ ఫ్యాన్ క్రియేట్ చేసిన ఆ పోస్టర్ ప్రస్తుతం పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ 'సర్దార్ గబ్బర్ సింగ్' పోజుతో క్రియేట్ చేసిన ఆ పోస్టర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. పవన్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'హరహరవీరమల్లు' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. మార్చ్ 11న శివరాత్రి సందర్బంగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.