
రెజీనా కసాండ్రా.. టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీలేవు.. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎటువంటి పరిమితులు లేకుండా సినిమాలు చేస్తుంది ఈముద్దుగుమ్మ.. చేతిలో సినిమాలేవీ లేకపోయినా ఆమె క్రేజీకి ఏమాత్రం ఢోకా లేదు.. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది. మంచి నటిగా కూడా పేరు ఉన్న రెజీనా కి అనేక సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె క అదృష్టం కలిసి రాలేదు.

ఆమె నటించిన చాలా సినిమాలు ఫెయిల్ అవడంతో ఆమెకు ఐరన్ లెగ్ బ్యూటీ అనే ముద్ర పడింది. దీంతో ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో మారుతున్న పరిస్థితులను గ్రహించి ఆమె చెల్లి పాత్రలు చేయడానికి కూడా వెనుకాడట్లేదు.. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెల్లర్స్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రమోషన్ యాడ్ లో రెజీనా నాగ్ కు చెల్లి గా నటిస్తుంది. ఈ యాడ్ చాలా వెరైటీగా ఉండడంతో చాలామంది చూస్తున్నారు.

ఈ యాడ్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కూడా నటించారు. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన గుండెలమీద పెరిగిన చెల్లెలు అత్తారింటి కి వెళ్లి పోతుందే అన్న ఆవేదన చెందే అన్నయ్య గా నాగ్ నటిస్తే, బాధపడకు ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పే చెల్లి గా రెజీనా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఒకలాంటి మోషన్ సాంగ్ కూడా పెట్టడంతో ఈ యాడ్ కి జనం విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. మరి ఈ యాడ్ అయినా తనకు మంచి మంచి పాత్రలు తెస్తుందా చూద్దాం..