దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "మా నాన్న నక్సలైట్ చిత్రం జులై 8న విడుదల అవుతుంది. ఇది నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక అద్భుతమైన తండ్రి కొడుకుల కథ. ప్రతి తండ్రి కొడుకుల ఎమోషనల్ కథ. చదలవాడ శ్రీనివాసరావు గారు కథ విని చాలా మంచి సినిమా అవుతుంది అన్న నమ్మకం తో చాలా బాగా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించబడింది . ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ బ్యానర్ లో సినిమా చేయటం చాలా సంతోషం గా ఉంది . నా సొంత ప్రొడక్షన్ హౌస్ లా ఫీల్ అయ్యాను. ఇంత మంచి చిత్రం చేయడానికి అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడు మనసుకు హత్తుకుంటుంది . జూలై 8 న విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించండి " అని తెలిపారు.
దర్శకుడు అజయ్ మాట్లాడుతూ "మా నాన్న నక్సలైట్ చిత్రం లో ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం లా ఉంటుంది . రాజకీయ నాయకుల్లో మంచివాళ్ళు ఉన్నట్టు జర్నలిస్ట్ లో కూడా చెడ్డవాళ్లు ఉంటారు, ఇది ఈ చిత్రం లో ఒక డైలాగ్, ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ లు ఎన్నో ఉన్నాయి ఈ చిత్రం లో. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మంచి సెంటిమెంట్ సినిమా. సొసైటీ కి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి" అని కోరుకున్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ "మా నాన్న నక్సలైట్ చిత్రం పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి అని అందరూ అంటున్నారు. కథ విన్న వెంటనే చాలా నచ్చింది. సినిమా ఇంకా చాలా బాగా వచ్చింది. నా బ్యానర్ లో వస్తున్న అద్భుతమైన చిత్రం "మా నాన్న నక్సలైట్". మీడియా మిత్రులు కూడా మా చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు. సునీల్ కుమార్ గారితో మరిన్ని చిత్రాలు చేస్తాను" అని తెలిపారు.
బ్యానర్ : అనురాధ ఫిలిమ్స్ డివిజన్
చిత్రం పేరు : మా నాన్న నక్సలైట్
నటి నటులు : రఘు కుంచే, అజయ్, సుబ్బ రాజు , ఎల్ బి శ్రీరామ్, జీవ, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా, వినయ్ మహాదేవ్, అనిల్, ఎఫ్ ఎమ్ బాబాయ్, సముద్రం వెంకటేష్, బాబ్జి , బుగత సత్యనారాయణ , అంకోజీ రావు , కాశి విశ్వనాథ్, కనకా రావు, ప్రసన్న కుమార్, పద్మజ లంక, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, తదితరులు
సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి
లిరిక్స్ : యక్కలి రవీంద్ర బాబు, గమన్ శ్రీ, పెద్దాడ మూర్తి,
కెమెరా : ఎస్ వి శివ రామ్
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
రచన, దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాత : చదలవాడ శ్రీనివాసరావు