పవన్, రానా సినిమా టైటిల్ పై అందరిలో ఎంతో ఆసక్తి..!!

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా అయ్యనుము కోషియం రీమేక్. రానా మరో కథానాయకుడు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.. సాగర్ చంద్ర దర్శకుడు కాగా త్రివిక్రమ్ రచయితగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా సంక్రాంతి ని ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ లుక్ ను రివీల్ చేస్తూ, ఆయన పాత్ర పేరు 'భీమ్లా నాయక్' అనే విషయాన్ని వెల్లడించారు. ఇక రానా పాత్ర ఏమిటనేది చెప్పాల్సి ఉంది. మలయాళంలో ప్రధానమైన రెండు పాత్రల పేర్లను కలుపుతూ టైటిల్ పెట్టారు. తెలుగులో కూడా అలాగే టైటిల్ ను సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువలన రానా పాత్ర పేరు ఎప్పుడు రివీల్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తిచేయాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నాడు. వచ్చేనెలలో టైటిల్ పోస్టర్ ను వదలాలనే ఆలోచనలో ఉన్నారట. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు .. ఆ రోజున ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.