ది ఎవర్ గ్రీన్ యాక్టర్

ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి మలయాళం సినిమా సూపర్ స్టార్ గా ఎదిగిన మమ్మూట్టి గారు ఆయన చేసే ప్రతి సినిమాల్లో విభిన్నతకి పెద్ద పీట వేస్తారు. ఆయనకి ఎంత స్టార్ అయినప్పటికీ పాత్ర నచ్చితే అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆయనికి మొదటి సినిమా నుంచి అలవాటు. దాదాపుగా 400 సినిమాలు చేసి 30 సంవత్సరాలు గా మలయాళ సినిమాకి సూపర్ స్టార్ గా వెలుగుతున్నారు మమ్మూట్టి గారి నటనకి ఎవరెనా అభిమానులు కావాల్సిందే.

జననం

మమ్మూట్టి గారి అసలు పేరు ముహమ్మద్ కుట్టి పనపరంబైల్ ఇస్మాయిల్. ఆయన సెప్టెంబర్ 9 , 1951 చండిరూర్  అనే గ్రామంలో తండ్రి ఇస్మాయిల్ , ఫాతిమా దంపతులకి  జన్మించారు. మమ్మూట్టి గారిది మధ్య తరగతి కుటుంబం. ఆయన తండ్రి ఇస్మాయిల్ గారు హోల్ సేల్ బియ్యం వ్యాపారం చేసేసారు. మమ్మూట్టి కి ఇబ్రహీం కుట్టి , జాకరయ్య అని ఇద్దరు తమ్ముళ్లు మరియు అమీనా , సౌభా , షఫినా అనే ముగ్గురు చెల్లెల్లు కూడా ఉన్నారు. మమ్మూట్టి గారి ప్రాథమిక  విద్యాభ్యాసం అంత కొట్టాయంలో ఉన్న గౌర్నమెంట్ హై స్కూల్ గడిచింది.అలాగే ఆయన డిగ్రీ చదువు ఏమకులం లో ఉన్న మహారాజ కాలేజ్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత గౌర్నమెంట్ లా కాలేజ్ లో ఎల్ ఎల్ బి పట్టా పొందారు. ఆ తర్వాత మమ్మూట్టి గారు మంజీరి లో రెండు సంవత్సరాలు లాయర్ గా శిక్షణ పొందారు. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా సినిమాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది.

సినీ జీవితం

మమ్మూట్టి గారు 1971 లో ఎస్ కె సేతుమధవన్ దర్శకత్వంలో వచ్చిన  అనుభవంగల్ పాలిచాకల్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన రెండోవ సినిమా కాలచకర్యం లో ఒక చిన్న పాత్రలో నటించారు. ఇక 1979 లో ఆయన మొదటిసారి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా దేవలోకం. కానీ ఈ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు.అలా 1980 లో వచ్చిన విక్కనుండు స్వప్నగల్ సినిమాలో మొదటిసారి ఆయన పేరు సినిమా టైటిల్స్ లో పడింది. అయితే అదే సంవత్సరం వచ్చిన మెల సినిమాలో ఆయనకి ముఖ్య పాత్ర దక్కింది. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటి అంటే అప్పట్లో పొట్టిగా ఉండే నటుడు రఘు ని హీరోగా పెట్టి తియ్యడం అప్పట్లో పెద్ద చర్చ కి దారితీసింది.

ఇక 1980లో వచ్చిన చాలా సినిమాల్లో మమ్మూట్టి గారి పేరు సజీన్ అనే పేరుతో టైటిల్స్ ఉండేవి. ఆయన సహాయ నటుడుగా నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో యువనిక ,అహింస , పడయోట్టం లాంటి సినిమాలు ఉన్నాయి. 1982 లో ఈనాడు సినిమా అప్పట్లో సౌత్ ఇండియాలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. అప్పట్లో లండన్ లో ఇండియన్ సినిమాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేవాళ్ళు.

అలాంటి సమయంలో మోహన్ లాల్ , మమ్మూట్టి కలిసి నటించిన  పడయోట్టం అనే సినిమా మొదటిసారిగా ఇండియాలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. ఈ సినిమా బడ్జెట్ కూడా అప్పట్లో పెద్ద సంచలనమే. ఎందుకంటే అప్పటి మలయాళం సినిమాలు 15 లక్షలకి మించి బడ్జెట్ పెట్టేవారు కాదు. కానీ ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా కోటి రూపాయలు పెట్టి సినిమాని తీశారు. ఈ సినిమా కూడా విడుదల తర్వాత అప్పటిదాకా ఉన్న మలయాళం సినిమాలా కలెక్షన్స్  కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

1982 నుంచి 1987 సంవత్సరాలలో మమ్మూట్టి గారు ప్రధాన పాత్రలో ఏకంగా 150 సినిమాల్లో సినిమాల్లో నటించారు. ఒక్క 1986 సంవత్సరం లోనే ఆయన 35 సినిమాల్లో నటించడం విశేషం. అలా 1989 లో మమ్మూట్టి గారు నటించిన ఓరు వడక్కన్ వీరగత సినిమా కి బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా 4 నేషనల్ అవార్డులు వచ్చాయి. అలాగే ఈ సినిమాని ఇండియాలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా గుర్తించారు.

1991లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాలో రజినీకాంత్ గారితో కలిసి నటించారు. ఈ సినిమా ఇద్దరి కెరీర్ ల్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

1992లో మమ్మూట్టి గారి  తెలుగులో చేసిన  మొదటి సినిమా స్వాతి కిరణం సినిమా ఆయనికి ఎంతో గొప్ప పేరు ని తీసుకొచ్చింది.ఈ సినిమా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ , ఆసియా పేసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా చాలా ఫిల్మ్ ఫెస్టివల్ లలో ప్రదర్శించారు. ఈ సినిమాలోని ఆనతి నీయరా హారా పాటకి ఉత్తమ గాయని గా వాని జయరాం గారికి నేషనల్ అవార్డ్ వచ్చింది. కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన స్వాతి కిరణంలో అన్ని పాటలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ సినిమాని మలయాళంలోకి ప్రణవం పేరుతో డబ్బింగ్ చేశారు.

ఇక 1999లో మమ్మూట్టి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆయన అంబేద్కర్ గారి పాత్రలో ఓడిగిపోయారు అని చెప్పాలి. ఈ సినిమా హిందీ - ఇంగ్లీష్ భాషలలో నిర్మించారు. ఈ సినిమాకి మొదటిగా హాలీవుడ్ ప్రముఖ నటుడు రాబర్ట్ డి నిరోని అనుకున్నారు అది కుదరలేదు. డైరెక్టర్ జబ్బర్ పటేల్ ఒక మ్యాగజైన్ లో మమ్మూట్టి గారి ఫోటో చూసి ఆయనని అంబేద్కర్ గారి పాత్రలో తీసుకున్నారు. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది.

ఇక 2000 సంవత్సరంలో మమ్మూట్టి గారు ఆరాయన్నగాలుడే వీడు , వల్లేట్టన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు.అలాగే 2001 లో ఆయన చేసిన దుబాయ్ సినిమా అప్పట్లో మలయాళం లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా కావడం విశేషం .ఆ తర్వాత ఆయన నటించిన క్రానిక్ బాచిలర్ , సేతురామ అయ్యర్ సి బి ఐ , బ్లాక్ , వేషం సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

2005 లో మమ్మూట్టి గారివి 6 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అన్వర్ రషీద్ డైరెక్షన్ లో వచ్చిన రాజమణిక్యం సినిమా ఆ సంవత్సరంలో హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా నిలిచింది. అంతే కాదు 2008 వరకు ఇదే మలయాళంలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమా. ఇక 2006లో 3 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన బలరాం వర్సెస్ తరాదాస్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా  సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమా కూడా బడ్జెట్ తగ్గ  రేంజ్ లో కలెక్షన్స్ కూడా సంపాదించింది.

ఇక మమ్మూట్టి గారికి తర్వాత కొన్ని సంవత్సరాల సరైన హిట్స్ లేవు. కొన్ని సినిమాలు యావరేజ్ హిట్స్ గా నిలిచిన కానీ ఒక మంచి సాలిడ్ హిట్ మాత్రం 2009 లో వచ్చిన కేరళ వర్మ పాజస్సు రాజా అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమా దాదాపుగా 27 కోట్లతో నిర్మించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా బాగా ఆధారణ పొందింది. ఈ సినిమా టోటల్ రన్ లో 43 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.అలా 2010 లో ఆయన నటించిన ద్రోణ , ప్రమాని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ అదే సంవత్సరంలో  వచ్చిన పోకిరి రాజా  సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే శ్రేయ శరన్ మలయాళం ఇండస్ర్టీలోకి పరిచయం అయింది. ఈ సినిమాని తెలుగులో నాగార్జున గారు భాయ్ పేరుతో రీమేక్ చేశారు.

ఇక 2014 లో వచ్చిన వర్షం సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా విమర్శల దగ్గర సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో మమ్మూట్టి గారి నటనకి ప్రశంసలు చాలా వచ్చాయి.ఆ తర్వాత ఆయన నటించిన భాస్కర్ ద రాస్కెల్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.ఈ సినిమా కేరళ థియేటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకొను దాదాపుగా 20 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.

మమ్మూట్టి గారు 2016 లో నటించిన కసబా సినిమా మొదటిరోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమా మీద చాలా విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో మహిళలని కించపరిచే విధంగా సీన్స్ ఉన్నాయి అని ఈ మూవీ టీంకి కేరళ విమెన్స్ కమిషన్ నోటీసులు పంపించారు. ఇలా ఈ సినిమా మీద ఎన్ని విమర్శలు వచ్చిన కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది.

ఇక 2018 లో వచ్చిన పేరెంబు సినిమా ఆయన లోని నటుడుని ఇంకోసారి అందరికి గుర్తు చేసింది. ఈ సినిమాలో ఒక ఆవిటి కూతురుని జాగ్రత్తగా చూసుకునే తండ్రిగా మమ్మూట్టి గొప్ప నటనని మనం చూడొచ్చు. ఈ సినిమా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించారు.

2010లో వచ్చిన పొక్కిరి రాజా సినిమా కాన్సెప్ట్ తీసుకొని 2019లో మమ్మూట్టి గారు చేసిన మధుర రాజా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల వరకు కలెక్షన్స్ సంపాదించింది. ఈ సినిమా మమ్మూట్టి గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా ఇదే.ఆ తర్వాత వచ్చిన ఉండ, మమంగం సినిమాలు సరిగ్గా ఆడకపోయిన ఆయన నటనకి మంచి పేరు వచ్చింది.

అలాగే ఆయన ఇదే సంవత్సరంలో చేసిన తెలుగు చిత్రం యాత్ర సినిమా మంచి హిట్ అవ్వడమే కాకుండా తెలుగు అభిమానులకి ఆయన్ని దగ్గర చేసింది. ఈ సినిమాలో మమ్మూట్టి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో నటించి మెప్పించారు.

ఇక కరోన ప్రభావం వలన 2020లో విడుదల కావాల్సిన మమ్మూట్టి గారి ద ప్రీస్ట్ , వన్ సినిమాలు 2021 లో విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు మంచి స్పందన వస్తుంది.

వ్యక్తిగత జీవితం

మమ్మూట్టి గారుకి  1979లో సల్ఫేత్ గారితో వివాహం జరిగింది.ఈ దంపతులకి కూతురు సురుమి, కొడుకు దుల్కర్ సల్మాన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మలయాళం సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగాడు.

కైరాలి టెలివిషన్ ఛానల్ కి  మమ్మూట్టి గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన ఆమె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాన్సర్ వ్యాధి వచ్చిన వారికి మెరుగైన జీవితాన్ని అందిస్తున్నారు.

అవార్డ్స్

మమ్మూట్టి గారికి 3 నేషనల్ అవార్డ్స్ , 7 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ , 13 ఫిలింఫేర్ అవార్డ్స్ , 11 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ మరియు 5 ఆసియనెట్ ఫిల్మ్ అవార్డ్స్ లభించాయి.

1998 లో ఆయనకి భారతదేశ ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డ్ తో సత్కరించింది.అలాగే ఆయనకి యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా , మరియు యూనివర్సిటీ ఆఫ్ కేరళ తరుపునుంచి డాక్టరేట్ లభించింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.