

ఇస్మార్ట్ రామ్ ఎనర్జిటిక్ హీరో. క్లాస్ అయినా మాస్ అయినా ఆ పాత్రలో ఒదిగిపోతాడు. సినిమా కోసం శ్రమిస్తూనే ఉంటాడు, సినిమాని ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ ఇస్మార్ట్ హీరో. ఫేయిర్ లుక్ తో ఎప్పుడూ ఫిట్ గా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. తాజాగా రామ్ పోతినేని ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎంతో హాండ్ సమ్ గా ఉన్న ఈ ఫోటోలో స్మార్ట్ ప్రిన్స్ లా కనిపిస్తున్నాడు రామ్. ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ఫార్మల్ కలర్ ఫ్యాంటుతో లుక్కు అదిరందనే చెప్పాలి. డిజైనర్ లుక్ కి తగ్గట్టే చక్కని క్రాఫ్ స్మైలీ ఫేస్ తో లైట్ గడ్డంతో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు. బాటిల్స్ బిహైండ్ రామ్ ఫోటో అందరికీ నచ్చేసింది నెటిజన్లు అందమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోకి 9 నుండి 5 వరకు మీరు ఎలా రాక్ అవుతున్నారో వారికి చూపించండి. 5 నుండి 9 వరకు మీరు ఎలా రోల్ చేస్తారో వారికి చూపించండి అన్న థీమ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాల్లో చాలా స్పీడ్ గా వైరల్ అవుతోంది. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న రెడ్ ప్రమోషనల్ వీడియోలు ఇప్పటికే యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. రామ్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై ఈ ఇస్మార్ట్ హీరో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
9 to 5: Show em how you Rock..
— RAm POthineni (@ramsayz) November 6, 2020
5 to 9: Show em how you Roll!!
Love..#RAPO pic.twitter.com/9ZrYB8Utkg