
కొన్ని రోజుల క్రితం యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారి కూతురు శివాత్మిక తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రాజశేఖర్ గారు కరోనతో పోరాడుతున్నారు అని ఆయన పరిస్థితి చాలా కష్టంగా ఉందని మీరంతా ఆయన కోసం ప్రేయర్స్ చేయాలి అంటూ అవిడ కోరిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన మిత్రుడు, సహా నటుడు అయిన రాజశేఖర్ గారు త్వరగా కోలుకోవాలని అలాగే రాజశేఖర్ ఫామిలీ అంత ధైర్యంగా ఉండాలని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలానే చాలా మంది రాజశేఖర్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన త్వరగా కోలుకొని మామూలు పరిస్తితికి రావాలని కోరుకున్నారు. దాని వల్లేనేమో హీరో రాజశేఖర్ గారి పరిస్తితి మెల్లగా మెరుగు అవుతూ ఉంది. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. అందులో సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్నకిశోర్ గారు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. ఇటీవల ఆయనకు ప్లాస్మా థెరపీ చేశాం. సైటోసోర్బ్ పరికరం ద్వారా చికిత్స అందించాం. నిరంతం మా వైద్యబృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అని తెలిపారు. ఇప్పటికే రాజశేఖర్ గారి సతీమణి జీవిత గారు కరోనా నుంచి బయటపడి హాస్పిటల్ నుంచి డిస్ ఛార్జ్ అయ్యారు. త్వరలోనే రాజశేఖర్ గారు కూడా కరోనా ప్రభావం నుంచి బయట పడి మళ్లీ మామూలు స్థితికి రావాలని అభిమానులు, సినీ నటులు కోరుకుంటున్నారు.
— Shivathmika Rajashekar (@ShivathmikaR) October 27, 2020