
కొన్ని కొన్ని సార్లు సెలెబ్రిటీల క్రేజ్ ఎలా ఉంటుందంటే తమకు ఇంత క్రేజ్ ఉందా అని వారు కూడా ఊహించలేరు. అలాంటిదే పాయల్ రాజ్ పుత్ కి ఓ ఈవెంట్ లో ఎదురైంది.. ఊహించని ఈ పరిణామంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతు అయ్యింది.. సెలెబ్రిటీలు ఈవెంట్ లకు, ఓపెనింగ్ లకు వెళ్లడం అందరికి తెలిసిందే. అలా వెళ్ళినప్పుడు భారీగా జనసందోహం ఉంటుంది.. అభిమానులకు ఇలాంటి ఫంక్షన్ లలోనే కదా సెలెబ్రిటీలు దర్శనమిచ్చేది.. అందుకే భారీ గా వస్తుంటారు..

అలా పాయల్ ఓ కార్యక్రమానికి వస్తే ఆమెను ఫ్యాన్స్ సర్ప్రయిజ్ చేశారు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా లైట్ లైట్ లోకి వచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.తొలి సినిమా తోనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి ఆమె పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు.. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో అరంగేట్రమే ఇలాంటి పాత్ర చేసిన ఆమె ధైర్యం మెచ్చుకోవచ్చు.. అయితే పాయల్ కి తొలి సినిమా తో పది సినిమాలు చేసినా రాని గుర్తింపు దక్కించుకుంది.. అందచందాలతో కవ్విస్తూ నటనతో మెప్పించే అమ్మాయి గా టాలీవుడ్ లో ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.


సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న పాయల్ కు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు గిలిగింతలు పెడుతూనే ఉంది. ఇక తాజగా గుడివాడకు వెళ్లిన పాయల్ అక్కడ కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఘన స్వాగతాన్ని అందుకుంది. ట్రెడిషినల్ గా పట్టు చీరలో అక్కడికి వచ్చిన పాయల్ అభిమానులను చూసి షాక్ అయ్యింది.పాయల్ ను చూసేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. జనాలను కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బందికి చాలా కష్టమైంది. అయితే ఆమె రాగానే క్రేన్ తో తెచ్చిన అతిపెద్ద దండతో మర్యాద చేశారు. ఆ దండను చూసి పాయల్ ఆశ్చర్యపోయింది. నోరేళ్ళబెడుతూ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.