ఆయన మది నుండి పొలమారిన మధురమైన జ్ఞాపకాలు

80వ దశకంలోని ప్రేక్షకులకు వంశి గారి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు అటువంటివి. అప్పటి సినీ ప్రేమికులకి ఆయన ఒక వరం. చెట్టు కింద ప్లీడర్, లేడీస్ టైలర్, అన్వేషణ, సితార లాంటి సినిమాలతో అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించారు. ఆయన సినిమాల్లో కథ, కథనం, సంగీతం దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన కేవలం సినీ రంగంలోనే కాకుండా సాహిత్య రంగంలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

దర్శకుడిగా ఎంతటి ఖ్యాతిని గడించారో, కథకుడిగా కూడా అంతే గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఒకరకంగా తెలుగు సినిమా, సాహిత్యం కలిసి ఉండేందుకు ఎంతగానో కృషి చేసారు. కథకుడిగా ఎన్నో కథలను ఆయన రచించారు. మా పసలపూడి కథలు, ఖచ్చింతంగా నాకు తెల్సు!, నల్లమిల్లోరి పాలెం ఇలా ఎన్నో కథా సంపుటాలను ఆయన నేటి తరానికి అందించారు. ఆయన కథల్లో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఆయన కథలు మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి చివరికి కనుల వెంట నీళ్ళను తెప్పిస్తాయి. ఆయన పెట్టె టైటిల్స్ కూడా అంతే విచిత్రంగా ఉంటాయి.

ఇటీవలే ఆయన నుండి మరో పుస్తకం విడుదలైంది. ఆయన మదిలోని గూడు కట్టుకున్న జ్ఞాపకాల నుండి ఆయన కలం వెంట జాలువారిన ముధురమైన కథలు అవి. ఎప్పుడో ఎక్కడో జరిగిన సంఘటనలు మనకు తెలియకుండానే మనలో అసంకల్పితంగా ముద్రించుకుపోతాయి. మళ్ళీ ఎప్పుడో ఆ సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జ్ఞప్తికి వస్తాయి. అలా పొలమారిన సంఘటనల సమూహారమే ఈ పొలమారిన జ్ఞాపకాలు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.