స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాంచ్ చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM’ థియేట్రికల్ ట్రైలర్‌!!

7:11 PM’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. విజువల్స్, సౌండ్ అద్భుతంగా వున్నాయి: డైరెక్టర్ హరీష్ శంకర్

సైన్స్ ఫిక్షన్ జోనర్ చిత్రాలకు హై బడ్జెట్ అవసరం. అయితే, సాహస్, దీపిక నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM ‘నిర్మాతలు కథ, భారీ-స్థాయి మేకింగ్,  అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం పరిమిత బడ్జెట్, వనరులతో రూపొందించబడినప్పటికీ అవుట్ పుట్ మాత్రం అంతర్జాతీయ ప్రాజెక్ట్ కి సరి సమానంగా వుంది. ఈ సినిమా టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాంచ్ చేశారు.

కథ మూడు వేర్వేరు కాలాలు , రెండు వేర్వేరు గ్రహాలలో జరుగుతుంది. ఒక ఫ్లయింగ్ సాసర్  ఒక మిషన్‌లో భూమిలోకి ఎంటర్ అవుతుండగా, ఇండియాలోని  హంసలాదీవి అనే చిన్న పట్టణంలో బస్సు ఎక్కిన వ్యక్తి, మరుసటి రోజు మెల్‌బోర్న్‌లోని బీచ్‌లో అపస్మారక స్థితిలో ఉంటాడు. కేవలం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఒక రోజులో అంత దూరం ఎలా ప్రయాణించాడో, ఏమి జరిగిందో  అతనికి తెలియదు. అతను ఒక ఇంపాజిబుల్ మిషన్‌ను సాధించడానికి అనేక సవాళ్ళు ఎదుర్కొని, సమయంతో పోటి పడాలి. 7:11 PM’  ఆలోచన, కథ చాలా వినూత్నంగా ఉంది.  రచన., తీసిన విధానం ఎక్స్ టార్డినరిగా వుంది . VFX కోసం వెచ్చించే ప్రతి పైసా ఒక్కో ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.  ప్రధాన నటీనటులు నటన , నిర్మాణ,  సాంకేతిక విలువలు అద్భుతంగా వున్నాయి. ఆర్కస్ ఫిలింస్ బ్యానర్‌పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి,  వాణి కన్నెగంటి నిర్మించిన ఈ చిత్రానికి చైతు మాదాల దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 7:11 PM ట్రైలర్ చూస్తుంటే భారీ సినిమాలకి వున్న వీఎఫ్ఎక్స్ కనిపించాయి. చాలా ఇంట్రస్టింగా వుంది. సినిమాని చాలా ప్యాషన్ తో నిర్మించిన టీం కి అందరికీ నా అభినందనలు.  టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా వుంది. సౌండ్, విజువల్స్ చాలా బావున్నాయి. 7:11 PM జులై 7న వస్తోంది. అందరూ థియేటర్ లో తప్పకుండా చూడండి’’ అన్నారు.

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూపించారు. వీఎఫ్ ఎక్స్ చాలా అద్భుతంగా వున్నాయి. ఒక పెద్ద సినిమాకి చేసేలా... వావ్ అనేలా వుంది. కొత్త దర్శకుడనే భావన రాకుండా చాలా అనుభవం వున్న దర్శకుడిలా తీశారు. ఇందులో పని చేసిన అందరూ చాలా ప్యాషన్ తో పని చేశారు. దర్శకుడు ఆస్ట్రేలియా, ప్రొడ్యుసర్ అమెరికా.. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉంటేనే ఇంత అద్భుతమైన కంటెంట్ తీయగలరు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. జులై 7న థియేటర్ లో కలుద్దాం’’ అన్నారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. చైతు సినిమాపై చాలా ప్యాషన్ వున్న దర్శకుడు. ఎక్కడా రాజీపడకుండా తీశాడు. ఈ టైం ట్రావెల్ సినిమా ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. విజువల్ అద్భుతంగా వుంటాయి. గ్యాని చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాహస్ చాలా ప్రతిభ వున్న నటుడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. జులై 7న సినిమా వస్తోంది. పెద్ద విజయం సాధించి సినిమాలో పని చేసిన అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు  

దర్శకుడు చైతు మాదాల మాట్లాడుతూ.. టీజర్ , ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా వీటి కంటే నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ కథ రాయడానికి  ఏడాదిన్నర పట్టింది. చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇది సినిమా లాగ్ లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది సినిమా చూస్తున్నపుడు చాలా ఆసక్తికరంగా వుంటుంది. అన్ని రకాల ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. దీపిక, సహాస్ చాలా చక్కగా నటించారు. మైత్రీ రవి గారు ఒక మంచి సినిమాకి సపోర్ట్ ఇవ్వాలని బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. వారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక గ్రహాన్ని రూపొందించాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.’’ అన్నారు.

సాహస్ మాట్లాడుతూ.. మైత్రీ రవి గారికి, హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. మైత్రీ రవి గారు ఎంతో సపోర్ట్ గా నిలబడ్డారు.   చైతు చాలా ప్యాషన్ వున్న డైరెక్టర్. ఈ ప్రయాణంలో తన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం.మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది.’’ అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

ఈ చిత్రానికి జ్ఞాని సంగీతం అందించగా, శివశంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని  అందిస్తున్నారు. శ్రీను తోట ఎడిటర్.

ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రి ద్వారా జూలై 7న 7:11 PM భారీగా విడుదల కానుంది.  

తారాగణం - సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు &  తదితరులు

దర్శకుడు - చైతు మాదాల
నిర్మాత - నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి
సంగీతం - గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె / జై లోగిశెట్టి
డీవోపీ - శివ శంకర్ / ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్ - శ్రీను తోట
పీఆర్వో - వంశీ-శేఖర్

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.