25 వంసంతాల ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’

షారుక్ ఖాన్, కాజల్ జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ పుట్టి పాతికేళ్లవయస్సుకి వచ్చింది. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే రచయిత ఆదిత్య చోప్రా ఈ కథను మూడేళ్ళ పాటు రాసారు.మొదటగా అనుకున్న కథలో ఫారిన్, ఇండియన్ లవ్ స్టోరీ ఉంటే యశ్ చోప్రా దాన్ని పూర్తి ఎన్.ఆర్.ఐ కథగా మార్చారు.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేశారు. ఈ చిత్రానికి టైటిల్ ని
కిరణ్ ఖేర్ సూచించారు. “చోర్ మచాయేంగే షోర్” సినిమాలో “లేజాయేంగే లేజా యేంగే” పాటలోని లిరిక్స్ నుండి ఈ టైటిల్ తీసుకున్నారు. కిరణ్ ఖేర్ కి టైటిల్స్ లో క్రెడిట్ కూడా ఇచ్చారు.

ట్రెండ్ సెట్టర్ పాయింట్:

అప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లో ప్రేమ కథ చిత్రాలు, లేదా కుంటుంబ చిత్రాలు అన్ని ఒకే విధానంతో జరిగేవి, ముగిసేవి. కథలో హిరో హిరోయిన్ ప్రేమించుకున్నారు అంటే లేచిపోవడం, లేదా వాళ్ళ జీవితాల్లో విషాద సంఘటనలు జరిగేవి. త్యాగాలు ఉండేవి. కానీ ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ చిత్రంలో అవేవి ఉండవు. కథా సుఖాంతంగా ముగుస్తుంది. ఆ చిత్రం లో హిరో రాజ్ పాత్ర కొత్తగా ఉంటుంది. అప్పటి వరకు సినిమాల్లో కొడుకు పాత్రలు
తండ్రి అంటే భయం, భక్తితో ఉంటాయి. కానీ రాజ్ తన తండ్రితో చాలా జోవియల్ గా, క్లోజ్ గా ఉంటూ తండ్రిని స్నేహితుడిలా భావిస్తాడు.ఇక కథ విషయానికి వస్తే లండన్ లో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి కి ఇంటి వాతవరణం తప్ప బయట వాతావరణం తెలీదు. హీరో సరదగా అందరి కుర్రాళ్ళ లానే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండే ఈజీ గోయింగ్ కుర్రాడు.
ఇద్దరి చదువులు పూర్తి అయ్యాక యూరప్ యాత్ర కోసం అని వెళ్తూ ట్రైన్ లో ఒకరికొకరు పరిచయం అవుతారు.

ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. కానీ అమ్మాయి తండ్రి అప్పటికే పంజాబ్ లో పెళ్ళి సంబంధం చూసుంటాడు. అమ్మాయి తన ప్రేమ విషయం తండ్రి కి చెప్పగా ఆయన వాళ్ళ ప్రేమని అగింకరించడు. ఫ్యామిలీ మొత్తాన్ని పంజాబ్ కి షిప్ట్ చేస్తాడు. హీరోయిన్ ఆ విషయాన్ని హిరోకి తెలియజేసి లేచిపోయి పెళ్ళి చేసుకుందాం అంటుంది. ఇక్కడి వరకు కథ అన్నీ సినిమాల్లో లాగా మామూలుగానే సాగుతుంది. ఈ సిచ్యూవేషన్ తర్వాత అమ్మాయి,అబ్బాయి లేచిపోవడమో, పెద్దలని ఎదిరించి ఒక్కటవ్వడమో లేదా విడిపోయి త్యాగం చేయడమో వుంటుందని ఊహిస్తాము. అమ్మాయి అడిగనప్పుడు అబ్బాయి పెళ్ళి చేసుకుంటే కథ ముగిసిపోయేది లేదా ఉహించిన విధంగానే కథా సాగేది.

కానీ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలో అలాంటివి ఏమీ జరగవు.హిరో హిరోయిన్ పెళ్ళి జరుగుతున్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ పెళ్ళికొడుకు స్నేహితుడిగా అందరికి పరిచయం అయ్యి, హిరోయిన్ ఫ్యామిలీని ఒప్పించి హిరో హిరోయిన్ ను తనతో పాటు తీసుకెళ్తాడు. ఎవరినీ నొప్పించకుండా అందరి మెప్పు పొంది హీరోయిన్ని పెళ్ళి చేసుకోవాలి అనే ఒక్క పాయింట్ సినిమా కథా విధానాన్నే మార్చి ట్రెండ్ సెట్టింగ్ గా మారింది. ఈ పాయింట్ మీద హింది, తెలుగు లో చాలా కథ లు వచ్చాయి సూపర్ హిట్ అయ్యాయి. ఢీ ,రెడీ లాంటి చాలా చిత్రాలు కూడా ఇదే పాయింట్ మీది కథలు. ఈ సినిమా తరువాతే ఎన్.ఆర్.ఐ పాత్రలున్న కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.


హిట్ పేయిర్..

ఈ చిత్రంలో షారుక్ ఖాన్, కాజోల్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ సినిమా తరువాత చాలా సినిమాల్లో కాజోల్, షారుక్ జంటగా నటించారు. ఈ సినిమాలో పాటలు, లవ్ సీన్స్, ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఉర్రుతలుగించాయి. “తు జే దేఖా హై తో” పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. క్లైమాక్స్ లో కాజోల్ తండ్రి చెయ్యి వదిలి షారుక్ దగ్గరికి పరిగేత్తే సీన్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ చాలా సినిమాల్లో, సిరియల్స్ లో షారుక్ స్టైల్, సినిమాలోని సీన్స్
రిఫరెన్స్ గా, స్పూప్ లు గా చేస్తుంటారు. ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ సినిమా తర్వాత కాజల్, షారుక్ హిట్ పేయిర్ గా మారారు.

కలెక్షన్ ల వర్షం...

దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా బడ్జెట్ నాలుగు కోట్లు. అప్పట్లో ఇది చాలా ఎక్కువ. ఈ సినిమా కలెక్ట్ చేసిన రుపాయలు అక్షరాల రెండువందల యాభై కోట్లు. ఈ సినిమా తరువాత యశ్ రాజ్ ఫిల్మ్స్ దేశంలో నెం:1 ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ‘షోలే’ సినిమా ముంబాయి లోని మినర్వా థియోటర్ లో ఐదేళ్ళు ఆడింది కానీ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా 2014 సంవత్సరం వరకే వెయ్యి వారాలు ఆడింది. ప్రంపంచంలో రికార్డ్ లు బద్దలు కొడుతూ లాక్ డౌన్ సమయం వరకు మరాఠా మందిర్ థియోటర్ లో పాతికేళ్ళుగా ఏదో ఒక షో టైమ్ లో ఆడుతూ వచ్చింది. షారుక్ ఖాన్ తనకి ఈ సినిమా ఇచ్చినందుకు యశ్ రాజ్ ఫిల్మ్స్ కి చాలా సార్లు తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తరువాత వరుసగా యశ్ రాజ్ ఫిల్మ్స్ లో చాలా సినిమాలు చేశారు. ఈ చిత్రానికి జతిన్- లలిత్ లు సూపర్ హిట్ మ్యూజిక్, పాటలు అందించారు.ఈ రోజుకి దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా ఫ్యామిలి ఆడియన్స్ కి, యూత్ కి ఇష్టమైన ఎవర్ గ్రీన్ సినిమా.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.