
దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో ... శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేయగా, మోషన్ పోస్టర్‌ను మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్‌గా పిలుచుకునే డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.
డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘మనం కాలేజీ జాయిన్ అయిన కొత్తలో మనలో తెలియని ఓ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో మనకు తెలియకుండానే మనం రచ్చ చేస్తాం. ఈ సినిమాలోనూ అంతే మా బాయ్స్ చాలా రౌడీ పనులతో రచ్చ చేస్తారు. దాని వల్ల ఏం జరిగిందనేదే సినిమా. ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. శిరీష్‌గారి అబ్బాయి ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత, అందరూ ఆశిష్గారి నాన్న శిరీష్‌గారు అంటారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్’’ అన్నారు.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘‘నేను ఈ బ్యానర్లో చేసిన మూడో సినిమా ఇది. శతమానం భవతి సమయంలో నేను ఆశిష్‌ను కలిసినప్పుడు, ఇద్దరం మాట్లాడుకుంటుంటే తను హీరో అవుతానని అన్నాడు. కానీ తను హీరోగా చేసిన ఈ సినిమాలో నేను పార్ట్ అవుతానని అప్పుడు అస్సలు అనుకోలేదు. ఆశిష్‌కు ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్. డైరెక్టర్ హర్షకు థాంక్స్. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్’’ అన్నారు.