దీపావళి శుభాకాంక్షలతో 'భీమ్లా నాయక్‘ నూతన ప్రచార చిత్రం విడుదల: * "లాలా భీమ్లా" పాట నవంబర్ 7 న విడుదల!!

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
'భీమ్లా నాయక్' నుంచి మరో గీతం విడుదలకానుంది. దీనికి సంభందించి చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్ తో కూడిన వీడియోను విడుదల చేసింది. ప్రోమో ను పరికిస్తే...." నాగరాజు గారుహార్టీ కంగ్రాట్స్ లేషన్స్ అండిమీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందిహ్యాపీ దీపావళి" అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరినో ఉద్దేశించి అనటం కనిపిస్తుంది. ప్రోమో చివరిలో "లాలా భీమ్లా" పాట నవంబర్ 7 న విడుదల అన్న ప్రకటన కూడా కనిపిస్తుంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయినప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన 'భీమ్లా నాయక్' పాత్ర తీరు,తెన్నులు. భీమ్లా నాయక్ దమ్ము, ధైర్యానికి అక్షర రూపంలా, కథానాయకుడి గొప్పదనాన్ని కరతలామలకం చేసేలా సాగిన గీతం, అలాగే విజయదశమి పర్వదినాన విడుదల అయిన ‘అంత ఇష్టమేందయ‘ పాట అభిమాన ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. వీటికి ముందు పవన్ కళ్యాణ్, రానా ప్రచార చిత్రాలు కూడా  సామాజిక మాధ్యమాలు వేదికగా సరికొత్త రికార్డు లను నమోదు చేసిన సంగతి తెలిసిందే.'భీమ్లా నాయక్‘ చిత్రాన్ని తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.


పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISCసంగీతం: తమన్.ఎస్ ఎడిటర్:‘నవీన్ నూలిఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టిపి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.