విజయ్ సినిమా కు అంత ఆఫర్ నిజంగా ఇచ్చారా..!!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కసారిగా సడెన్ బ్లాస్ట్ లా హాట్ టాపిక్ అవుతుంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “లైగర్”. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా  గా తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది..

ఇటీవలే ఈ సినిమా కి సంబందించిన లుక్ కూడా రిలీజ్ కాగా ప్రేక్షకులలో మంచి స్పందన దక్కించుకుంది ఈ సినిమా.. అయితే ఆల్ మోస్ట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రానికి ఏకంగా 200 కోట్లు ఆఫర్ ఓ ప్రముఖ ఓటిటి ఇచ్చింది అని టాక్ రావడంతో ఈ సినిమాకి ఆ రేంజ్ లోనా అని తెలిసే లోపే వైరల్ అయ్యిపోయింది.

అలాగే విజయ్ కూడా ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు. సరే ఇవి పక్కన పెడితే అసలు ఈ చిత్రానికి ఇంత మొత్తంలో ఆఫర్ వచ్చింది అన్న దాంట్లో ఎలాంటి నిజం కూడా లేనట్టు తెలుస్తుంది. జస్ట్ రూమర్ మాత్రమే అని ఇంకా ఈ సినిమా చెంతకు ఎలాంటి ఓటిటి ఆఫర్ వెళ్ళనట్టుగా సినీ వర్గాల సమాచారం. అలాగే ఒకవేళ వచ్చినా కూడా ఇంత మొత్తంలో వచ్చి ఉండదని కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం మరోసారి విజయ్ సినిమా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.