
వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ ఈ సంవత్సరం సూపర్ హిట్ హిట్ అయ్యింది. దాంతో వేణు శ్రీ రామ్ కి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయట.. ఆ సినిమా లో పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఈ దర్శకుడే.. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు, డైరెక్షన్ కూడా బాగుండడంతో ఆయనపై ఇతర స్టార్ హీరోల కన్ను పండింది అంటున్నారు.

వకీల్ సాబ్ హిట్ తో వేణు శ్రీ రామ్ అదృష్టం మొత్తం మారిందని చెప్పాలి ఎందుకంటే అంతకు ముందు ఆయనకు పెద్దగా అవకాశాలు లేవు..లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా వకీల్ సాబ్ కావడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ పెద్ద లు సైతం దీనిపై ఓ కన్నేసి ఉంచారు.. మొత్తానికి ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవడంతో పాటు అదే రేంజ్ లో కూడా హిట్ అయ్యింది.. ఏదైతేనేం టాలీవుడ్ కి మరో స్టార్ డైరెక్టర్ దొరికాడని అర్థమైపోయింది.

ఇక అయన తదుపరి చిత్రం ఐకాన్ ని ఇదివరకే ప్రకటించగా అది ఆగిపోయింది.. అయితే వకీల్ సాబ్ హిట్ తో అది మళ్ళీ పట్టాలెక్కనున్నట్లు దిల్ రాజు వెల్లడించాడు. అయితే ఇక్క లాజిక్ ఏంటంటే తమ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ‘ఐకాన్’ అన్నాడుగానీ.. అందులో హీరో అల్లు అర్జున్ అని చెప్పలేదుగా అని ఇప్పుడు లా పాయింట్ లాగుతున్నారు చాలా మంది. వాస్తవం కూడా అదేనట. ఈ ప్రాజెక్టులో నటించడానికి బన్నీ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో పరిస్థితుల ప్రకారం ఓకే చెప్పినప్పటికీ.. ఇప్పటి పరిస్థితుల ప్రకారం నో చెప్పాడట. మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.