
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి సూపర్ హిట్ దక్కించుకోవాలని చూస్తున్నారు ఈ కాంబో. గతంలో సింహా లెజెండ్ సినిమాలు ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా భారీ హిట్ గా నిలుస్తుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వీరి కలయికలో తెరకెక్కిన అఖండ సినిమాపై మీరు భారీ ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా ఫలితం పైనే బోయపాటి శ్రీను భవిష్యత్తు సినిమాలు ఆధారపడి ఉంటాయని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. దసరాకి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో సూర్యకు కూడా బోయపాటి ఒక కథను వినిపించినట్టుగా చెప్పుకుంటున్నారు. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నేరుగా తెలుగులో రూపొందే ఈ సినిమా, తమిళంలోనూ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ ప్రాజెక్టు ఆలస్యమైతే ముందుగా సూర్యతోనే బోయపాటి సినిమా ఉంటుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.