
రచ్చ సినిమా తో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సంపత్ నంది ఆ తర్వాత మళ్ళీ సూపర్ హిట్ ను అందుకోలేదు.. తాజాగా గోపీచంద్ తో సీటిమార్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకోగా తమన్నా హీరోయిన్ గా నైటిస్తుంది ఈ సినిమాలో. ఇక సంపత్ నంది ఇటీవలే చిరంజీవి ని కలవడం ఇప్పుడు అందరిని ఎంతగానో ఆసక్తి ని కలిగిస్తుంది.

ఆచార్య సినిమా పూర్తి చేసిన చిరంజీవి మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'లూసిఫర్' సినిమా రీమేక్ చేయనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని అనుకున్నారు.

అయితే ఈ టైటిల్ దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉందట. 'రచ్చ' సినిమా నుంచి సంపత్ నందికి చిరూ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన మెగా ఫ్యామిలీ నుంచి కబురు వెళ్లగానే సంపత్ నంది సంతోషంగా ఆ టైటిల్ ను చిరూకి ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్న సంగతి తెలిసిందే.