
ఇప్పటికే వరుస సినిమాలతో హిట్ లు కొడుతూ తమిళ నాట టాప్ సక్సెస్ రేటు ఉన్న హీరో గా ఉన్నాడు ధనుష్. ఈనేపథ్యంలో అయన తెలుగు లో స్ట్రైట్ సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన కాగా అయన దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా పనులు చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల..

ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ధనుశ్ కి లైన్ మాత్రమే చెప్పి శేఖర్ కమ్ముల ఓకే అనిపించాడట. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది. అందువల్లనే ఈలోగా ధనుశ్ మరో తెలుగు సినిమాను చేయడానికి అంగీకరించినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఓ పెద్ద బ్యానర్లో నిర్మితం కానున్న ఈ సినిమా బాధ్యతను ఓ యంగ్ డైరెక్టర్ కి అప్పగించడం జరిగిందని అంటున్నారు. ముందుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.