
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఎన్టీఆర్.. నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణల తర్వాత ఆ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తొలుత అనామకుడిగా వచ్చి ఆ తరవాత తాత పోలికలతో ఉన్నాడు ఎవరీ కుర్రాడు అనేలోపే స్టార్ హీరో అయిపోయాడు.. హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత తన పాపులారిటీతో ఎన్టీఆర్ నాన్న హరికృష్ణ అనేంతగా ఎదిగాడు..

ఎన్టీఆర్ స్టార్ మెటీరియల్ అని తెలియడానికి ఎన్నో సినిమాలు పట్టలేదు.. రెండో సినిమా తోనే తనకు స్టార్ హీరో అయ్యే ఫీచర్స్ ఉన్నాయని నిరూపించాడు. ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాలో నటిస్తున్నాడు. ..ఈ సినిమాలో కొమురం బీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్, టీజర్ ఆమధ్య రిలీజ్ కాగా ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. రామ్ చరణ్ తేజ్ మరో కథానాయకుడు కాగా అయన ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగా త్వరలోనే షూటింగ్ కి వెళ్లబోతుంది ఈ సినిమా.

తాజా నివేదికల ప్రకారం ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారట. కొరటాల శివ దేవిశ్రీప్రసాద్ నీ తప్పా ఇతర సంగీత దర్శకుడిని తీసుకోవడానికి ఆసక్తి చూపడు చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీత బాణీలు అందిస్తున్నారు. చిరు బలవంతం వల్ల మార్చాడు తప్పితే లేదంటే దేవినే ఉండేవాడు.. కానీ తన దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ సినిమాకు మణిశర్మ ని తీసుకోవడానికి కొరటాల శివ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నిజానికి గతంలో కొరటాల శివ దేవిశ్రీప్రసాద్ కలిసి నాలుగు సినిమాలకు పనిచేశారు. వీరిద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడింది. దీన్ని బట్టి డేట్ ఖాళీగా ఉంటే ఎన్టీఆర్ సినిమాకి సంగీతం సమకూర్చడానికి దేవిశ్రీప్రసాద్ ఖచ్చితంగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది..