
ఒకే ఒక్క సినిమాతో స్టార్డమ్ సొంతం చేసుకుని విజయాలతో దూసుకుపోతున్న నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాతో చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైన విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రతో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో ప్రామిసింగ్ హీరోగా మార్క్ వేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో చేసిన అర్జున్ రెడ్డితో దేశం మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు ఈ రౌడి బోయ్.

ఇక ఆ తర్వత వచ్చిన సినిమాలో ద్వారక, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాని ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఆయన హిట్ కొట్టడం అనివార్యం. ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్ తో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చేసింది. దీని తర్వాత చేయబోయే సినిమాలేంటి అనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. అప్పట్లో సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఇది కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు.

అయితే ఈ రెండిటిలో ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. సుకుమార్ గారు పుష్పతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయిన వెంటనే విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని అందరూ అనుకున్నారు కానీ సుకుమార్ తన తర్వాత సినిమాని రామ్ చరణ్ తో చేస్తునట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఎవరూ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ తోనే ఉంటుంది అని టాక్. దీని గురించి ఫాల్కన్ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ మాంచి జోష్ లో ఉన్నారు.