
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ ఫ్యాన్ కి పండగ వాతావరణాన్ని నెలకొల్పింది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా బ్యూటీ ఫుల్ ప్రేమకథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది..

అయితే.. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాను కరోనా రెండు సార్లు అడ్డుకుంది. దీంతో.. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ ఇన్ టైమ్ లో పూర్తికాలేదు. 80వ దశకం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాలా వరకు సెట్స్ లో షూట్ చేశారు. మిగిలిన పార్టు కోసం సీజీ వర్క్ ను ఆశ్రయించారు. ఈ వర్క్ ను విదేశీ కంపెనీలకు అప్పగించడం.. అక్కడ కరోనా ఇబ్బందులు రావడం.. ఇలాంటి చాలా కారణాలతో పని ఆలస్యమైంది.

ఇక ఈ సమయంలోనే రీ-షూట్ కు సైతం వెళ్లారని టాక్. వాస్తవానికి ఓ పాట యాడ్ చేయాల్సి ఉంది. కొన్ని సీన్లు రీషూట్ చేస్తే బాగుంటుందని కూడా ప్రభాస్ అన్నాడట. అయితే.. ఈ కరోనా టైమ్ లో అవసరమా అని అనుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇంకా ఓ వారం షూట్ మిగిలి ఉందని తెలుస్తోంది. అంటూ షూట్ కు వెళ్లిపోయారన్నమాట. ఇది మినహా మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ బ్యాలెన్స్ కూడా షూట్ చేసి ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తే.. ప్రభాస్ ప్రేమ కావ్యం సిద్ధమైపోతుంది.