మాస్టర్ విషయంలో గొడవకు కారణం ఆ అమ్మాయే...! ఒక్క నవ్వుతో ఎంత పని చేసింది

ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన ‘మాస్టర్’ ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తూ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోగా 200 కోట్ల కలక్షన్స్ కొల్లగొట్టి విజయ్ కెరీర్ లో 200 కోట్లు కొల్లగొట్టిన 4వ చిత్రంగా నిలిచింది.

కాలేజి బ్యాక్డ్రాప్ లో జరిగే కథ, అందులోనూ విజయ్ లెక్చరర్ గా నటించడం, విజయ్ సేతుపతి భవానిగా విలన్ క్యారెక్టర్ చేయడం, అందులోనూ ఖైదీ లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనగారాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం ఈ సినిమాపై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. విజయ్, విజయ్ సేతుపతిల మధ్య వచ్చే సన్నివేశాలైతే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మాస్టర్ లాంటి హిట్ తో థియేటర్లలో నిజంగానే పండగ వాతావరణం నెలకొంది.

అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్ని సెన్సార్ కట్ చేసింది. విపరీతమైన వయోలెన్స్ తో కూడిన సీన్స్ కొన్ని సెన్సార్ కత్తెర భారిన పడక తప్పలేదు. కాని చిత్రబృందమే ఒక సీన్ను డిలీట్ చేసింది. ఆ సీన్ను యుట్యూబ్ లో పెట్టింది చిత్రబృందం. అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి, వాళ్ళను ఎలా గౌరవించాలో చెప్తూ ఉన్న ఆ సీన్ చాల బాగుంది. ఆ సీన్ను చిత్రబృందం ఎందుకు డిలీట్ చేసిందా అని అభిమానులు, ప్రేక్షకులు అనుకుంటుండగా ఒక విషయం బయటపడింది. ఆ సీన్లో నటించిన గౌరీ కిషన్ సీన్లో అనుకోకుండా నవ్వింది. ఆ సీన్లో విజయ్ మాట్లాడుతుండడంతో షూటింగ్ అప్పుడు ఎవరూ చూస్కుని ఉండరు. అ తర్వాత చూసి దాన్ని ఎడిట్ చేయడం తప్పలేదు.

చివరకు ఒక చిన్న నవ్వు వల్ల ఒక సినిమాలో సీన్ డిలీట్ చెయ్యాల్సి వచ్చింది. కొంత మంది ఆమెను విమర్శిస్తుండగా, కొంతమంది ఆమె నవ్వింది సరే మరి టీం చూస్కోకుండా ఎం చేస్తుంది అని ఆమెను సప్పోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె నవ్వకుండా ఉన్నా, వాళ్ళు అది గమనించి రీటేక్ చేసి ఉన్నా ఈ రబస జరిగేది కాదు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.