మైండ్ బ్లో అయ్యే కేర‌క్ట‌ర్‌లో దీపిక ప‌దుకోన్‌: సిద్ధార్థ్ ఆనంద్!!

షారుఖ్ ఖాన్‌, దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హామ్ న‌టిస్తున్న ప‌ఠాన్ సినిమాకు సంబంధించి ప్ర‌తి సూక్ష్మ‌మైన అంశాన్ని జాగ్ర‌త్త‌గా తీర్చిదిద్దుతోంది య‌ష్ రాజ్ ఫిల్మ్స్. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. షారుఖ్‌ఖాన్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి మూడు ద‌శాబ్దాలైన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేసిన ప‌ఠాన్‌లో షారుఖ్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. అంతే కాదు, జులై 25కి ప‌ఠాన్‌ని మొద‌లుపెట్టి ఆరె నెల‌లైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించిన దీపిక ప‌దుకోన్ గ్లింప్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్.
దీని గురించి డైర‌క్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ ``దీపిక ప‌దుకోన్ మాసివ్‌, మాసివ్ స్టార్ (నేను రెండు సార్లు చెప్పాల‌నుకుంటున్నాను). ప‌ఠాన్‌లో ఆమె ప్రెజెన్స్ మ‌రింత ఎగ్జ‌యిటింగ్‌గా, సూప‌ర్బ్ గ్రాండ్‌గా ఉంటుంది. ఇప్ప‌టిదాకా ప‌ఠాన్‌లో ఆమె లుక్ ఎవ‌రూ చూడ‌లేదు. అందుకే మేం గ్లింప్స్ ని స్పెక్టాకిల్ వేలో రిలీజ్ చేయాల‌నుకున్నాం. ఆమె చేసిన పాత్ర చూస్తే ఎవ‌రికైనా మైండ్ బ్లో అవ్వాల్సిందే. ఈ సినిమాలో ఆమె అయ‌స్కాంతంలా అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది. ఆమె కెరీర్ తొలినాళ్ల‌లో ఆమెతో క‌లిసి ప‌నిచేశాను. కానీ రోజులు గ‌డిచే కొద్దీ ఆమెను ఆమె తీర్చిదిద్దుకున్న విధానం న‌న్ను విస్మ‌యానికి గురి చేసింది. ఆమె ఇప్పుడు సంపూర్ణ‌మైన వైవిధ్య‌మైన న‌టి. ఆక‌లి మీదున్న న‌టి. ప‌ఠాన్‌లో ఆమె ఫ‌స్ట్ లుక్‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ నా మాట‌ల్లో ఉన్న లోతును అర్థం చేసుకుంటారు`` అని అన్నారు.

సిద్ధార్థ్ దృష్టిలో దీపిక నిజ‌మైన ప్యాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌. ప‌ఠాన్‌లో ఆమె ప్రెజెన్స్ వ‌ల్ల ప్రాజెక్ట్ సుప్రీమ్లీ ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది.

దీపిక గురించి సిద్ధార్థ్ ఇంకా చెబుతూ ``దీపిక రేర్ యాక్ట‌ర్‌. ప్యాన్ ఇండియా రేంజ్ అప్పీల్ ఉన్న ఆర్టిస్ట్ ఆమె. సినిమాకు ఆమె అతి పెద్ద యుఎస్‌పీ. ఈ రోల్‌కి భార‌త‌దేశంలో అత్యంత గ్రేస్ ఉన్న, ఆబాల‌గోపాలాన్ని ఆక‌ట్టుకున్న న‌టిని ఎంపిక చేసుకోవాల‌నుకున్నాం. కానీ మాకు దీపిక ప‌దుకోన్ క‌న్నా అత్యుత్తమ‌మైన యాక్ట‌ర్ మ‌రొక‌రు క‌నిపించ‌లేదు. ఆమె రోల్‌ని బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత‌తో వెయిట్ చేస్తున్నాం. 2023, జన‌వ‌రి 25న బిగ్ స్క్రీన్స్ మీద ప‌ఠాన్‌లో ఆమె కేర‌క్ట‌ర్‌ని ప్ర‌తి ఒక్క‌రూ చూసి తీరాల్సిందే`` అని అన్నారు.

షారుఖ్ ఖాన్‌, దీపికప‌దుకోన్ కాంబినేష‌న్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అత్యంత గొప్ప చ‌రిష్మా ఉంది. ఓమ్ శాంతి ఓమ్‌, చెన్నై ఎక్స్ ప్రెస్‌, హ్యాపీ న్యూయ‌ర్ సినిమాల‌తో ఈ జంట చేసిన మేజిక్‌కి అంత తేలిగ్గా జ‌నాలు మ‌ర్చిపోలేరు. రీసెంట్‌గా స్పెయిన్‌లో వీరిద్ద‌రూ క‌నిపించిన లీక్డ్ ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో ఇన్‌స్టంట్‌గా వైర‌ల్ అయ్యాయి. అక్క‌డ తెర‌కెక్కించిన పాట‌లో షారుఖ్ ఎయిట్ ప్యాక్స్ తో కనిపిస్తే, దీపిక బికినీలో హ‌ల్‌చ‌ల్ చేశారు. మ‌ల్లార్క‌లో ఈ షూటింగ్ జ‌రిగింది.
ప‌ఠాన్ సినిమా జ‌న‌వ‌రి 25, 2023న హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల కానుంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.