సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ తో మొదలై మెల్లగా హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్, ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్. ఒరిజినల్స్ బ్యానర్ల పై మహేశ్ కోనేరు, శృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలైంది. ఇక ఇప్పుడు ‘తిమ్మరుసు’ టీజర్ ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసారు. టీజర్ చాలా బాగుంది అని, మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి తిమ్మరుసు టీజర్ ని షేర్ చేశారు. ఇక ఈ తిమ్మరుసు సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ సినిమాలో సత్యదేవ్ కి జంటగా ప్రియాంకా జవాల్కర్ నటిస్తుంది. తిమ్మారుసులో బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్, ప్రవీణ్, అంకిత్ కొయ్య, కే.జీ.ఎఫ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను జనవరి లో విడుదల చేయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా సినిమాటోగ్రఫర్ గా అప్పూ ప్రభాకర్ పనిచేశారు.