ఇంద్రభవనాన్ని మించిపోతున్న దగ్గుబాటి రానా సొంత ఇల్లు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నా రానా కి మాత్రం సరైన బ్రేక్ వచ్చింది మాత్రం బాహుబలితోనే అనే చెప్పాలి.. ఆ సినిమాలో బల్లాలదేవుడిగా తాను తప్పా ఎవరు చేయలేరు అన్న రీతిలో దగ్గుబాటి రానా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.. క్రూరత్వం, దయలేని క్రూరుడి పాత్రలో కళ్ళతోనే హావభావాలని పలికించాడు రానా.. నిజానికి ఈ పాత్ర అనే కాదు తాను చేసిన సినిమాల్లోని పాత్రలన్నిటికి వందకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు రానా..  తొలి చిత్రం నుంచి అయన తాను చేసిన పాత్రలకి వందకు వంద శాతం న్యాయం చేశారు.

లీడర్ సినిమాతో పరిచయమైన రానా ఒక్క తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా నటిస్తూ అక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలితో ఇతను మాములు నటుడు ఏం కాదని ఆ సినిమాతో చెప్పేశాడు.. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటికే ఇతర భాషల్లో గుర్తింపు ఉండడంతో ఈ సినిమాలో ఆ పాపులారిటీని మరింత పెంచుకున్నాడు.. ప్రస్తుతం విరాటపర్వం, అరణ్య సినిమాలతో బిజీ గా ఉన్నాడు.  అరణ్య సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తుండగా త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది.

తాజాగా సోషల్ మీడియాలో రానా ఇల్లు గురించి సెర్చ్ చేయడం ఎక్కువైంది. ఎందుకంటే రానా ఇంటిలో ఎన్నో స్పెషలిటీస్ ఉన్నాయట.. రానా ఇల్లు హైదరాబాద్ ఫిలింనగర్ నడిబొడ్డున ఉన్న రామానాయుడు స్టూడియోస్ పరిసరాల్లో ఉంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ నైపుణ్యం.. మహదాద్భుతమైన సౌకర్యాలతో రాజప్రసాదానికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో రానా తన ఇంటిని నిర్మించుకున్నారు. స్వతహాగానే  రానా మంచి అభిరుచి ఉన్న హీరో. దానికి తోడు మంచి సంపాదకుడు. అందుకే చాలా ఏళ్ల క్రితమే సకల సౌకర్యాలతో తన నివాసాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంట్లో వసతులు ఏమున్నాయి? అన్నది చూస్తే.. లివింగ్ రూమ్- హాల్- బెడ్ రూమ్.. ఇలా ప్రతీదీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.