
సీనియర్ హీరో రాజశేఖర్ తన రీ ఎంట్రీ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న రాజశేఖర్ ఆ టైం లో అయన చేసినా హడావుడి అంతా ఇంతా కాదు.. సినిమా సూపర్ హిట్ కావడంతో ఎన్నో ఏళ్ల దాహం ఆయన తీర్చుకున్నట్లు అయ్యింది. వారి సెలెబ్రేషన్స్ కూడా ఆ రేంజ్ లోనే అయ్యాయి అనుకోండి.. సినిమా ఆఫీస్ వద్ద టపాసులు మోతలు మోగిపోయాయి.. ఈ దెబ్బతో రాజశేఖర్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లయ్యింది.

అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు..గరుడ వేగా హిట్ తో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఒక్కసారిగా పరాజయం పాలైంది.. ఆ లాంటి వెరైటీ సినిమా చేసిన ప్రశాంత్ ఇలాంటి సినిమా చేయడమేంటి అని దర్శకుడిని విమర్శించారు కూడా.. హీరో కి తగ్గట్లు కథ రాసి కథను నాశనం చేశారని విమర్శలు చాలా వచ్చాయి.. డైరెక్షన్ కి మంచి పేరు వచ్చినా సినిమా మాత్రం రొట్ట అని పేరు తెచ్చుకుంది..

దాంతో కొంత గ్యాప్ తీసుకుని మరీ రాజశేఖర్ నీలకంఠ దర్శకత్వంలో ఓ త్రిల్లర్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు..ఇదిలా ఉంటే రాజశేఖర్ కరోనావైరస్ బారిన పడి మృత్యువు అంచుకు వెళ్లి తిరిగి వచ్చారు. కరోనావైరస్ పాజిటివ్ కారణంగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఓ దశలో విషమంగా మారింది. అయితే వైద్యుల నిరంతర పర్యవేక్షణతో ఆయన తిరిగి మామూలు మనిషిగా తిరిగి వచ్చారు. రాజశేఖర్‌కు కరోనా తన వల్లే వచ్చిందంటూ కూతురు శివానీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఒకే సమయంలో ఓ పక్క నాన్నకు కరోనావైరస్ చికిత్స, మరో పక్క నేను గుండె సంబంధిత జబ్బుతో హాస్పిటల్లో చేరడంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ సమయంలో మాకు, మా కుటుంబానికి అగ్ని పరీక్షగా మారింది. దేవుడి దయవల్ల నాన్న, నేను క్షేమంగా తిరిగి వచ్చాం. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి నుంచి బయటపడటం అద్భుతంగా భావిస్తాం అని శివానీ పేర్కొన్నారు.