
లాక్ డౌన్ లో ఎంతో మంది అకాలీ తీర్చిన వ్యక్తి సోనూసూద్ వలస దారులకు, రోజుకూలిలకు, సహాయం చేసి ఆయన నిజమైన ఆపద్భాందవుడిగా నిలిచాడు. ఎంతోమందిని తమ సొంతూళ్ళకు పంపించారు. అలాగే విదేశాల్లో ఉండే ఎంతోమందిని స్వదేశానికి రప్పించాడు. ఆ తర్వాత ఒక ఫౌండేషన్ స్థాపించి అనాథలను చదివిస్తున్నాడు.

అలానే సివిల్స్, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వారిలో మెరిట్స్ కి ఫ్రీగా కోచింగ్ కూడా అందిస్తున్నాడు. ఎవరికైనా ఇలా ఎదుటి వారికి సహాయం చేయాలని ఉంటె వారు కూడా సోనూ టీమ్ సంప్రదించవచ్చు. ఇలా అనిపించినా ఒకతను సైట్ లో నంబర్ కి కాల్ చేయగా అవతలి వ్యక్తి సోనూ టీమ్ అని తనను పరిచయం చేసుకుని అతనితో కాసేపు ముచ్చటించి మీకు తోచినంత డొనేట్ చేయవచ్చు అని చెప్పడంతో అతను ముందుగా 10,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాడు.


మళ్ళీ అదే నంబర్ నుండి కాల్ చేసి ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలని 3 లక్షల 60 వేలు అవుతుందని. ఇంకా ఫండింగ్ చేస్తున్నామని, మీకు తోచినంత ఇవ్వొచ్చు అనడంతో అతను ఎంతో కొంత ఇవ్వడానికి సిద్దపడ్డాడు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీ అని 8,500, ఆ తర్వాత విడతల వారిగా ఒక 60 వేలు బాధితుడి దగ్గర నుంచి లాగారు.

వీరి వ్యవహార శైలి పై అనుమానం వచ్చిన అతను పోలిస్ కంప్లైంట్ ఇవ్వగా అసలు నిజం బయట పడింది. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో మోసాలు చెయ్యొచ్చని గ్రహించిన మోసగాళ్ళు తరచూ సోనుసూద్ పేరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ని సేవలు చేసిన సోనుసూద్ కి వీళ్ళ వల్ల అపకీర్తి రాక మానడం లేదు. ఇలా ఇంకెన్ని సార్లు ఆయన వీళ్ళకు టార్గెట్ అవుతాడో మరి.