
· టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గోల్ఫ్ స్టిక్‌తో ‘‘పుట్టింగ్’’చేసి టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు
· ‘‘మైరా’’-ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్! పేరుతో సమాజంలో మహిళ యొక్క విశిష్టమైన పాత్రపై నిర్వహిస్తున్న సాంప్రదాయ కార్యక్రమంలో డాక్టర్ సంగీత రెడ్డి, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్, కృతి శెట్టి & మధు షాలిని పాల్గొంటారు
హైదరాబాద్, ఫిబ్రవరి 2022 : క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి గోల్ఫ్ టోర్నమెంట్ అయిన ‘‘7వ ద్వైవార్షిక క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’ను నిధులు సేకరణకు మరియు వ్యాధిపై అవగాహన కోసం 2022 మార్చి 5 మరియు 6వ తేదీలలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో టాలీవుడ్ అందాల నటి రకుల్‌ప్రీత్ సింగ్; క్యూర్ ఫౌండేషన్, వ్యవస్థాపకులు & అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్, హైదరాబాద్, డైరక్టర్ డా॥ పి. విజయ్ ఆనంద్ రెడ్డి; శ్రీ సి. దయాకర్ రెడ్డి, ప్రెసిడెంట్, హెచ్జిఎ ; శ్రీ టి. అజయ్ కుమార్ రెడ్డి, కెప్టెన్ హెచ్జిఎ మరియు శ్రీ బి వి కె రాజు, గౌరవ కార్యదర్శి హెచ్జిఎ ; శ్రీ రాజన్ బి. దాతర్, ఫౌండర్ ఛైర్మన్, దాతర్ క్యాన్సర్ జెనెటిక్స్ ; శ్రీ వేణు వినోద్, మేనేజింగ్ డైరెక్టర్, సైబర్‌సిటీ బిల్డర్స్ & డెవలపర్స్ ప్రైవేట్. లిమిటెడ్ ; శ్రీ సురేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, ప్రైడ్ హోండా ; శ్రీ మనీష్ దయ్య, జనరల్ మేనేజర్, హెచ్ఐసిసి నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ; శ్రీ రవీందర్ నాథ్. సెక్రటరీ, రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్, మొయినాబాద్ మరియు శ్రీ ఉదయ్ పిళాణి రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్, మొయినాబాద్లు పాల్గొని వివరాలను వెల్లడిరచారు. రోటరీ క్లబ్‌తో పాటు పలువురు శాశ్వతంగా నిధులను సమీకరించడం ద్వారా క్యూర్ ఫౌండేషన్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో మార్చి 5 మరియు 6వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే 3 సెషన్లలో 300 మందికి పైగా గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. గేమ్ ఫార్మాట్‌ను స్టేబుల్‌ఫోర్డ్ పాయింట్లు, హ్యాండిక్యాప్ డబుల్ పియోరియా సిస్టమ్ ఉపయోగించి ఎంపిక చేయబడిరది. హెచ్‌సి కేటగిరి మరియు అందుకున్న పాయింట్ల ఆధారంగా వివిధ బహుమతులు అందించబడతాయి. వ్యక్తిగత సెషన్లతో పాటు మహిళలు మరియు సీనియర్ పార్టిసిపెంట్లకు ప్రత్యేక బహుమతులు ఉన్నాయి.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బాన్ని పురస్కరించుకుని మార్చి 6వ తేదీన నిర్వహించే బహుమతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్త్రీత్వాన్ని జరుపుకోవడంలో సాంప్రదాయంగా రూపొందించిన ‘‘మైరా’’ - ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్!ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు మరియు ప్రేక్షకులు మరియు గోల్ఫర్లతో ఉల్లాసవంతమైన వాతావరణంలో ముఖాముఖి వినోదం ఉంటుంది. వారి ఉనికి మరియు భాగస్వామ్యంతో ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రముఖుల్లో సైబర్‌సిటీ బిల్డర్స్ &డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిఇఒ, సప్తలా రెడ్డి ;లతా రెడ్డి, ఫిక్కీ ;సునీత రెడ్డి, 360 జిమ్ ;దీపా రెడ్డి, దొడ్ల ;పద్మజా రెడ్డి, పద్మశ్రీ ;డాక్టర్ కోలా శశికళ, గైనకాలజిస్ట్ ;డాక్టర్ శశికళ రెడ్డి, ప్రిన్సిపాల్, ఒఎమ్సి ;డాక్టర్ సంగీత రెడ్డి, జెఎమ్‌డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ;శిఖా గోయెల్, ఐపిఎస్ ;సుధా రెడ్డి, సోషియలైట్ ;అన్ను రాజ్ సింగ్, క్రీడాకారిణి ;లక్ష్మీ గోపీచంద్, క్రీడాకారిణి ;ప్రగ్యా జైస్వాల్, నటి ;కేథరీన్, నటి ;కృతి శెట్టి, నటి మరియు మధు షాలిని, నటి. గోల్ఫ్ క్రీడాకారులు మోడళ్లతో పాటు మరియు మహిళా ప్రముఖులు క్యాన్సర్ బాధితులతో కలిసి వాకింగ్ చేయడం కార్యక్రమానికే హైలెట్ కానున్నది.

రకుల్‌ప్రీత్ సింగ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఇలాంటి ఉదాత్తమైన అంశంతో అనుబంధం కలిగి ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది మరియు క్యూర్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డి అద్బుతమైన సేవ చేస్తున్నారు. భయంకరమైన వ్యాధికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో చేస్తున్న అద్భుతమైన కృషి మరియు సేవకు క్యూర్ ఫౌండేషన్‌ను నేను అభినందిస్తున్నాను. ఒకరికి జీవితాన్ని ఇవ్వగల సామర్థ్యాన్ని మించినది మరొకటి లేదు. ఈ ప్రపంచంలో మంచితనం ఉంది, దానిని మనం ఇక్కడ చూడవచ్చు, ప్రతి ఒక్కరు తమ సహకారంతో చాలా మంది జీవితాల్లో నవ్వులను మరియు ఆనందాన్ని తీసుకురాగలిగారు. కొన్నిసార్లు జీవితం చాలా అన్యాయంగా ఉంటుంది మరియు బహుశా మనలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడవచ్చు. క్యూర్ ఫౌండేషన్ రెగ్యులర్ చెకప్‌ల గురించి అవగాహన కల్పిస్తున్నది ఇది క్యాన్సర్ చికిత్స కోసం ముందుకు వెళ్లడానికి సరైన మార్గం మరియు ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు కూడా చికిత్స అందిస్తున్నది. ఇది మీరందరూ చేస్తున్న అద్భుతమైన పని మరియు దానిలో చిన్న భాగం అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

ఈ సందర్భంగా డా॥ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ గోల్ఫర్లు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, ఒపీనియన్ లీడర్ల సహకారంతో క్యాన్సర్‌పై మరింత విస్తృతంగా అవగాహనను కల్పిస్తూ నిధులను సమీకరించడం జరుగుతుంది. ఒక గొప్ప ఉద్దేశ్యం కోసం అందరూ ఒక్కటై తమ మద్ధతును తెలపడం ఎంతో అభినందనీయం. క్యూర్ ఫౌండేషన్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడిరది మరియు దీని ద్వారా ఇప్పటివరకు 2000 మందికి పైగా నిరుపేదలైన రోగులకు, ముఖ్యంగా పిల్లలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందించడంలో సహాయపడింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు అనేవి ఎప్పుడూ సహాయకరంగా ఉంటాయి, అందులో క్రీడలు అనేవి మరింత అత్యుత్తమైన మార్గాలు. దశాబ్దం క్రితం వరకు మేము 70% వరకు అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న రోగులను చూడవలసి వచ్చేది, అయితే తరచుగా ఇలాంటి క్యాన్సర్ అవగాహన కార్యక్రమలను నిర్వహించడం ద్వారా రోగులకు కొంత ఉపశమనం కలిగిస్తూ ప్రస్తుతం ప్రారంభ దశల్లోనే ఉన్నటువంటి 70% కేసులను చూస్తున్నాము. ప్రత్యేకించి సరైన చికిత్సను కనుక అందించినట్లయితే పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ను నయం చేయవచ్చు, వారి తల్లితండ్రులు చికిత్సను అందించలేనంత మాత్రాన పిల్లలకు చికిత్సను నిరాకరించకూడదు. పిల్లలకు మంచి చికిత్సను అందించడంలో గోల్ఫర్ సమాజం చాలా గొప్ప మద్దతును అందిస్తున్నది. వాస్తవానికి క్యూర్ ఫౌండేషన్‌తో చాలా మంది గోల్ఫర్లు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటూ అవసరమైన ప్రతిసారి రోగులకు మద్దతును అందిస్తున్నారు.’’
శ్రీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకరికి జీవితాన్ని అందించడం మనం ఇతరులకు అందించే అతిపెద్ద బహుమతి. క్యూర్ ఫౌండేషన్ సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది మరియు హెచ్జిఎ ఒక చిన్న మార్గంలో అందుకు సహకరించడం అదృష్టం. క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద గోల్ఫ్ టోర్నమెంట్. మా సభ్యులలో చాలా మందికి ఈ టోర్నమెంట్‌పై విపరీతమైన ఆసక్తి ఉన్నది మరియు వారు ముందుకు రావడానికి కారణం దానితో అనుబంధించబడిన ఒక మంచి కారణం.

శ్రీ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ మార్చి 5 మరియు 6 తేదీలలో మూడు సెషన్లలో ఆడుతుందని, ఇది స్టేబుల్‌ఫోర్డ్ పాయింట్‌గా ఉంటుందని, హ్యాండిక్యాప్తో డబుల్ పియోరియా పద్ధతిని అనుసరించి హ్యాండిక్యాప్లను ఎంచుకునేందుకు, వివిధ కేటగిరీలకు వివిధ రకాల బహుమతులు ఉంటాయని చెప్పారు. 300 మంది ఆటగాళ్లు పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము మరియు ఈవెంట్ వినోదభరితంగా ఉంటుంది.
శ్రీ మనీష్ దయ్య, ఛాంపియన్షిప్ సమాజానికి తిరిగి ఏదైనా మద్దతునిచ్చే అవకాశాన్ని అందిస్తుంది, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంతోపాటు నిరుపేదలకు రాయితీతో మరియు ఉచితంగా క్యాన్సర్‌కు చికిత్సను అందించడం మరియు లబ్ధిదారులలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం సంతోషాన్ని కలిగిస్తున్నది.
‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’కు చెందిన గత ఆరు ఎడిషన్లు
‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’కు చెందిన గత ఆరు ఎడిషన్లను రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం జరుగుతూ వస్తున్నది, మొదటి ఎడిషన్‌ను 2010లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భారత క్రికెట్‌కు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నిఖంజ్;సినీనటుడు నాగార్జున;టెన్నిస్ తార సానియా మీర్జా;మాజీ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ పుల్లెల గోపిచంద్ ;సినీతారలు రిచా గంగోపాధ్యాయ్, ప్రియమణి, సమంత, తమన్నా భాటియా, రీతికా మోహన్ సింగ్;క్యాథరిన్ థ్రెసా ;కుమారి హెబ్బా పటేల్;కుమారి దక్షా ;మహిళా ప్రముఖులు శ్రీమతి కె కవిత, శ్రీమతి డికె అరుణ, శ్రీమతి క్యాథరిన్ ధనాని, శ్రీమతి తేజ్‌దీప్ కౌర్ మీనన్, డాక్టర్. సంగీతా రెడ్డి, శ్రీమతి శోభన కామినేని, శ్రీమతి శిల్పారెడ్డి ఇంకా అనేకమంది ప్రముఖులు ఈ టోర్నమెంట్లో ఇతర గోల్ఫర్లతో పాటుగా పాల్గొని టోర్నమెంట్‌కు చక్కటి గుర్తింపును తీసుకువచ్చారు. ఈ సంవత్సరం కూడా సుమారు 300 మంది వరకు గోల్ఫర్లు పాల్గొంటారని అంచనా.
క్యూర్ ఫౌండేషన్ గురించి

2003లో డా॥ పి. విజయ్ ఆనంద్ రెడ్డిచే స్ధాపించబడిన క్యూర్ ఫౌండేషన్, క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడం, నివారణ మరియు పునరావాసంపై అవగాహన కలిగించడానికి చేపట్టిన ఒక స్వచ్చంద కార్యక్రమం. సమాజం యొక్క ప్రయోజనం కోసమై క్యాన్సర్‌పై అవగాహనను విస్తరించడంతో పాటు, ఈ ఫౌండేషన్ ద్వారా 2000 మందికి పైగా నిరుపేద రోగులకు, ముఖ్యంగా పిల్లలకు ఇప్పటివరకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను సులభతరం చేసింది మరియు అనేక పునరావాస, పరిశోధన మరియు విద్యా కార్యక్రమాలలో కూడా నిమగ్నమై ఉన్నది.
అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్, హైదరాబాద్ గురించి
అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ దేశంలోనే మొదటి సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్. ఇది హాల్‌మార్క్ ప్రత్యేకతను అందిస్తున్నది. వైద్య చికిత్సలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో సరితూగకలిగే ఫలితాలను అందిస్తున్నది. తాజా సాంకేతిక పరిజ్ఞానం, టోమోథెరపీ, ట్రూబీమ్, నోవాలిస్ టిఎక్స్, పెట్`సిటి స్కాన్, వేరియన్ బ్రాచైథెరపీ, రోబోటిక్ సర్జరీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్ మొదలైన వాటితో ఇక్కడి అంకాలజిస్ట్‌లు అన్నివేళలా అత్యంత ప్రమాణికమైన చికిత్సను అందిస్తారు. హృదయం లోపలి నుండి అందించినప్పుడే వైద్య సంరక్షణ నాణ్యత అనేది ఒక టెండర్ లవింగ్ కేర్‌గా ఉంటుంది, అపోలో ఫ్యామిలీ ‘టెండర్ లవింగ్ కేర్’ను ఒక విశ్వవ్యాప్త మంత్రంగా మలిచింది. ‘అపోలో వే’ ద్వారా తక్కువ ఖర్చుతోనే రోగికి సంతృప్తికరమైన చికిత్సను అందించడం జరుగుతున్నది. అపోలో క్యాన్సర్ హాస్పిటల్స్, హైదరాబాద్‌లో మేము మరిన్ని క్యాన్సర్లను నయం చేస్తాము.