ఒకటి ముగిసింది అనుకుంటే మరోకటి వచ్చిందే...

సినిమా చిన్నదైన, పెద్దదైన వివాదాలు అనేవి సహజంగా వస్తుంటాయి. సీన్ల గురించో, పాట గురించో, సినిమాలో నటించే నటుల గురించో ఏదో ఒకటి పట్టుకుని కొందరు కావాలని వివాదాలు చేయడం మనకు తెలిసిన విషయమే. ఆ మధ్య విడుదలైన ఆర్.ఆర్.ఆర్ లోని రామరాజు ఫర్ భీమ్ టీజర్ గురించైతే పెద్ద చర్చే జరిగింది. అందులో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్.టీ.ఆర్ వేరే మతానికి చెందిన వస్త్రాలంకరణలో ఉన్నారని, దాన్ని తొలగించాలని కొందరు అనవసరమైన వివాదాలు రేపారు. పెద్ద సినిమాలకే కాకుండా చిన్న సినిమాలకు కూడా అప్పుడుడప్పుడూ ఈ వివాదాల సెగ తగులుతూనే ఉంటుంది.

వివరాల్లోకి వెళ్తే సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలు అన్నిటికీ విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే విడుదలైన సారంగ దరియా పాట కూడా చాల పాపుల్లర్ అయ్యింది. దాదాపు 4 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో హిట్ లిస్ట్ లో ఉంది ఈ పాట. జానపద గీతానికి మెరుగులు అద్ది తనదైన బాణిలో ఈ పాటను రచించారు సుద్దాల అశోక్ తేజ గారు. మంగ్లీ తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోసిందన్న విషయం చెప్పాల్సిన పని లేదు. అయితే అసలు వివాదం ఇక్కడే మొదలైంది ఈ పాటను సేకరించి దాన్ని ప్రజలకు చేరువయ్యేలా చేసింది తనే అంటూ కోమలి మీడియా తలుపు తట్టారు. ఈ పాట పై సర్వ హక్కులు తనవే అని తనకు మాత్రం క్రెడిట్ ఇవ్వలేదని ఆమె వాపోయారు.

ఈ విషయం పై దర్శకుడు స్పందిస్తూ ఆ పాటను సినిమాలో పెడితే బాగుంటుందనే ఉద్దేశం తోనే సుద్దాల గారితో రాయించామని, మొదటగా ఈ పాటను పాడమని కోమలి గారినే కోరామని ఆమెకు ఆరోగ్యం బాలేదని చెప్పిందని, అప్పటికే రికార్డింగ్ కోసం సంగీత దర్శకుడు అంతా రెడీ చేస్కున్నారు, ఇక చేసేదేం లేక ఆ పాటను మంగ్లీ చేత పాడించామని ఆయన అన్నారు. దాంతో పాటు పాటలో ఆమెకు క్రెడిట్ ఇస్తామని అయన మాటిచ్చారు దాంతో ఆ ఎవ్వారం సద్దుమణిగింది. ఒక వివాదం ముగిసింది అనుకుంటే మరో వివాదం తెరపైకి వచ్చేలా ఉంది. అయితే అసలు ముందు ఈ పాటకు గాయనిగా మంగ్లీని అనుకోలేదా అని కొందరు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.