
మహేష్ బాబు, త్రివిక్రమ్ అంటే ముందుగా గుర్తొచ్చేది అతడు సినిమా.. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఆసినిమా బుల్లితెరపై సూపర్ హిట్.. వెరైటీ కాన్సెప్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా వెండితెర ప్రేక్షకులను ఎందుకు నచ్చలేదో తెలీదుకానీ మహేష్ బాబు క్లాసిక్ సినిమాలలో అతడు కూడా ఓ సినిమాగా మిగిలిపోతుంది.. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో వీరి కాంబో లో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది.

ఈనేపథ్యంలో ఎట్టకేలకు వీరి కలయిక లో ఖలేజా సినిమా వచ్చింది.. ఎందుకో ఏమో కానీ ఈ సినిమా కూడా అతడు లాగే మారిపోయింది. ఈసినిమా కూడా ధియేటర్లలో ఫ్లాప్ అయ్యింది.. బుల్లిత్తెరపై సూపర్ హిట్ అయ్యింది.. మహేష్ బాబు ను పూర్తి విభిన్నంగా చూపించిన సినిమా ఖలేజా.. మహేష్ లుక్స్, యాక్షన్, డైలాగ్స్ దగ్గరినుంచి ప్రతి ఒక్కటి కొత్త కోణంలో చూపించిన సినిమా ఇది..

త్రివిక్రమ్ డైరెక్షన్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి కానీ సినిమా చతికిలపడిపోయింది.. బుల్లితెరపై మాత్రం రికార్డు టీఆర్ఫీ రేటింగ్ లను సాధించింది ఈనేపథ్యంలో వీరి కాంబో లో మళ్ళీ సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు అభిమానులు.