
ఇటీవలే కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోయిన్ గా అందరికీ పరిచయమైన కథానాయిక చాందిని. అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులను తన అందచందాలతో హావభావాలతో అలరించింది. ప్రస్తుతం పెద్ద పెద్ద అవకాశాలన్ని పొందుతూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉంది. అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లై, బ్రహ్మోత్సవం, హౌరా బ్రిడ్జి సినిమాల్లో నటించి తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను సొంతం చేసుకుంది చాందిని చౌదరి.

గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా ఆమె హీరోయిన్ గా నటించి రెండు చిత్రాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి.కలర్ ఫోటో, సూపర్ ఓవర్ సినిమాలు ఆహా యాప్ లో విడుదల అవ్వగా మంచి సినిమాలు గుర్తింపు తెచ్చుకున్నాయ్. దాంతో ఆమెకు మంచి పేరొచ్చింది.. ప్రస్తుతం కిరణ్ సబ్బవరం హీరోగా సమ్మతమే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.

ఆ ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చాక ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో చెప్పుకొచ్చింది. ఈమె. ఆమె హీరోయిన్ అయ్యాక ''నువ్వేమైనా పెద్ద కలర్ అనుకుంటున్నావా?'' అని ఆమెను అడిగినట్టు చాందిని తెలిపింది.సమాజంలో ఇప్పటికీ వర్ణ వివక్ష ఉందని.. అలానే నన్ను కూడా అవమానించారని చెప్పింది చాందిని.