
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు అలాగే రక్షా బంధన్ కూడా. ఈ సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే నేషనల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ’భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. రక్షా బంధన్ సందర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ కట్టి చెల్లెలందరీ రక్షాబంధం... అభిమానులందరి ఆత్మ బంధం... మన అందరి అన్నయ్య జన్మదినం.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య... అంటూ ఆయనకు పుట్టినరోజు అభినందనలు తెలిపారు.
ఈ పవిత్రమైన రోజున మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం ఆనందంగా ఉంది. మీతో కలిసి నటించడమనేది నా కల. ఈ అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎదురువుతుందా అని ఎదురు చూడలేకపోతున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ తన ట్విట్టర్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ కీర్తి సురేశ్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో అన్నాచెల్లెల మధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ ..అన్నా చెల్లెలుగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో మనకు చాలా కాలం గుర్తుండిపోతుంది. సినిమాలో వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది

‘భోళా శంకర్’లో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకోవడమే కాదు, రక్షా బంధన్ రోజున ఈ సినిమాను అనౌన్స్‌మెంట్‌ను చేయడమనేది కరెక్ట్ ఛాయిస్. రక్షా బంధన్ రోజున విడుదలైన ఈ వీడియోకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ను చాలా స్టైలిష్‌గా తెరకెక్కిస్తాడనే పేరున్న డైరెక్టర్ మెహర్ రమేశ్.. ఈ ‘భోళా శంకర్’ సినిమాను ప్యామిలీ ఎమోషన్స్‌తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించబోతున్నారని అర్థమవుతుంది.