
MegaStar @KChiruTweets & King @iamnagarjuna met CM #KCR today at Pragathi Bhavan pic.twitter.com/2zsGFpqNz0
— BARaju (@baraju_SuperHit) November 7, 2020
ఇటీవల హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు నగరం చాలా దెబ్బతింది. జన జీవనం స్తంభించి పోయింది. అస్థి నష్టం కూడా భారీగా జరిగింది. బాలకృష్ణ, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది సినిమా ప్రముఖులు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చి తమ వంతు సాయం చేశారు. తాజాగా ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున లు ప్రగతి భవన్ లో ముఖ్య మంత్రి కేసీఆర్ నీ కలసి తమ వంతు విరాళాలు అందించారు. చిరంజీవి కోటి రూపాయల చెక్ నీ, నాగార్జున యాభై లక్షల చెక్ నీ అందచేశారు. వారికి ముఖ్య మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధి పై చర్చ జరిగింది. మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ "హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తానని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని" తెలిపారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. "ఈ స్థలంలో అధునాతన సాంకేతిక నైపణ్యంతో భవిష్యత్తు అవసారలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకొనేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. అని ముఖ్యమంత్రి తెలిపారు.
చిరంజీవి, నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగ్స్ ప్రారంభించామని త్వరలోనే థియేటర్స్ కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.