దసరా కి రానున్న చిరంజీవి ఆచార్య..!!

చిరంజీవి  కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టు పూర్తిచేసుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో చిరూ సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది.

దసరా .. దీపావళి .. సంక్రాంతికి విడుదల తేదీలను కొన్ని సినిమాలు ఫిక్స్ చేసుకోవడంతో, 'ఆచార్య' విడుదల ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఇక బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'అఖండ' పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉంది. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే షూటింగును పూర్తిచేసుకోనుంది. కానీ సంక్రాంతి వరకూ ఎక్కడా ఖాళీ లేకపోవడంతో, ఎప్పుడు ఈ సినిమాను వదులుతారోననేది అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.

అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కాకపోవచ్చనే టాక్ కొన్ని రోజులుగా బలంగానే వినిపిస్తోంది. ఈ సినిమా జనవరి 8వ తేదీన గానీ .. 20వ తేదీన గాని విడుదల కావొచ్చని అంటున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.